Delhi elections : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రచారం ముగిసింది. ప్రచారం ఆసాంతం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ప్రతిపక్ష బీజేపీ (BJP) మధ్య హోరాహోరీగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకున్నాయి. బుధవారం అంటే ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండటంతో సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల ప్రచారం కాలుష్యం, తాగునీటి సమస్య ముఖ్యమైన అంశాలుగా మారాయి. యమునా నది కాలుష్యం విషయం ప్రధాన అంశంగా ప్రచారం జరిగింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పటిలాగే ఈసారి కూడా త్రిముఖ పోరు నెలకొన్నది. జాతీయంగా చూసుకుంటే ఆప్, కాంగ్రెస్ రెండూ ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ ఢిల్లీలో మాత్రం వేర్వేరుగా బరిలో దిగుతున్నాయి. అయితే ఈసారి మెజారిటీ కొంతమేర తగ్గినా ఆమ్ ఆద్మీ పార్టీనే విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ కొన్ని సీట్లు పెంచుకుంటుందేమోగానీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఈసారి కూడా ఢిల్లీలో ఖాతా తెరుస్తుందో లేదోననే విషయం అనుమానంగా ఉంది.
Crime news | భర్త వేధింపులు భరించలేకే విష్ణుజ ఆత్మహత్య.. అందంగా లేవంటూ బైక్ ఎక్కించుకోలేదు..!
Crime news | శృంగారం వేళ అతడిని ఊపిరాడకుండా చేసి చంపిన మహిళ.. ఎందుకంటే..!
MLC Election | ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే నామినేషన్లు షురూ
Election Commission | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
Supreme Court | ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత.. సుప్రీంకోర్టుకు కేటీఆర్
Shakeel Ahmad Khan | కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్య.. Video