న్యూఢిల్లీ: దేశాన్ని కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. దానికితోడు శ్వాస తీసుకోలేని పేషెంట్లకు ఆక్సిజన్ దొరకడం గగనం అయ్యింది. రోగుల తాకిడి పెరుతుండటంతో అత్యవసరానికి అంబులెన్స్ దొరకడం కూడా కష్టమయ్యింది.
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌కు చెందిన ఆటో డ్రైవర్ జావేద్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తన ఆటోను అంబులెన్స్‌గా మార్చి, అందులో ఆక్సిజన్ సిలిండర్‌ను కూడా ఏర్పాటు చేశాడు. ఆపదలో ఉన్న రోగులను ఉచితంగా ఆస్పత్రులకు తరలిస్తున్నాడు. అంబులెన్సులు సరిపడా లేక రోగులు పడుతున్న అవస్థలు తెలిసి తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు.
ఆస్పత్రులకు వెళ్లడానికి రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సోషల్ మీడియాలో, టీవీ ఛానెళ్లలో చూసి తనకు ఈ ఆలోచన వచ్చిందని జావేద్ చెప్పాడు. అందుకే నా భార్య నగలు అమ్మి ఆటోను అంబులెన్స్‌గా మార్చానని తెలిపాడు. సోషల్ మీడియాలో ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచానని, ఆపదలో ఉన్నవాళ్లు ఫోన్‌చేస్తే ఆస్పత్రులకు తీసుకెళ్తున్నానని చెప్పాడు. ఇప్పటివరకు 15-20 మందిని ఆస్పత్రులకు చేర్చానని పేర్కొన్నాడు.
I sold my wife's jewellery for this. I queue up outside a refill centre & get oxygen. My contact number is available on social media. People can call me up if there's no ambulance. I've been doing this for 15-20 days now & have taken 9 serious patients to hospital: Javed Khan pic.twitter.com/LiEphjHenJ
— ANI (@ANI) April 30, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
కరోనా సోకి తీహార్ జైల్లో నలుగురు ఖైదీలు మృతి
పీఎం కేర్స్ కొవిడ్ ఆస్పత్రికి 57 మంది సభ్యుల నేవీ వైద్య బృందం
మహారాష్ట్రలో కరోనా ఆంక్షలు పొడిగింపు
తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు
ఆసిఫాబాద్‌లో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు
నెట్టుంటే.. నట్టింట్లోనే వైద్యం
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం