తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు | రాష్ట్రంలో వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్లో తెలిపింది. మరో 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది.

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్లో తెలిపింది. మరో 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. కొత్తగా 5,926 మంది మహమ్మారి నుంచి కోలుకొని ఇండ్లకు వెళ్లినట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,606కు పెరిగాయి. ఇప్పటి వరకు 3,55,618 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 2,261 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒకే రోజు 77,091 పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 77,727 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,441 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరిలో 631, రంగారెడ్డిలో 484, సంగారెడ్డిలో 401, నిజామాబాద్లో 330, నల్గొండలో 285, సిద్దిపేటలో 289, సూర్యాపేటలో 283, మహబూబ్నగర్లో 243, జగిత్యాలలో 230 కేసులు రికార్డయ్యాయి.
ఇవి కూడా చదవండి..
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
రాష్ట్రంలో వింత వాతావరణం..
బెంగాల్.. సస్పెన్స్ థ్రిల్లర్!
18+కు టీకాలెలా?
మ్డెసివిర్ ప్లీజ్!
‘స్పుత్నిక్ వీ’లో వైరస్
ముంబైలో మూడు రోజులు వ్యాక్సినేషన్ బంద్
ఇజ్రాయిల్ మౌంట్ మెరెన్లో తొక్కిసలాట.. 44 మంది మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

