రాష్ట్రంలో వింత వాతావరణం..
రాష్ట్రంలో వింత వాతావరణం.. | తెలంగాణలో వింత వాతావరణం నెలకొంటున్నది. ఓ వైపు ఎండలు దంచికొడుతున్నాయి.

హైదరాబాద్ : తెలంగాణలో వింత వాతావరణం నెలకొంటున్నది. ఓ వైపు ఎండలు దంచికొడుతున్నాయి. మరో వైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో గురువారం పగటి ఉష్ణోగ్రతలు 37.6 డిగ్రీల నుంచి 43.9 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలపైనే నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్ పేర్కొన్నది. గాలిలో తేమ శాతం తగ్గుతున్నది. ఆదిలాబాద్, నిజామాబాద్‌లో గాలిలో తేమ 16 శాతం చొప్పున, జగిత్యాలలో 17 శాతం నమోదైంది.
గడిచిన 24 గంటల్లో నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో 20.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇదిలా ఉండగా.. బుధవారం ఏర్పడిన ఉత్తర దక్షిణ ఉపరితల ఆవర్తనం గురువారం పశ్చిమ విదర్భ నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తమిళనాడు దాకా కొనసాగుతున్నది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన ఓ మోస్తరు వర్షం కురువొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉన్నదని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
బెంగాల్.. సస్పెన్స్ థ్రిల్లర్!
18+కు టీకాలెలా?
మ్‌డెసివిర్ ప్లీజ్!
‘స్పుత్నిక్ వీ’లో వైరస్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

