ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం |

న్యూఢిల్లీ : దేశంలో భారీగా పెరుగుతూ వస్తున్న కరోనా కేసుల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో మంత్రులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సైతం పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో సమావేశం సాగనుంది. సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో వైరస్ పరిస్థితులపై ప్రధాని సమీక్ష నిర్వహించనున్నారు. అదే సమయంలో ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, టీకాలు, అవసరమైన ఔషధాలపై లభ్యత తదితర ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు.
మహమ్మారిని ఎదుర్కొనేందుకు, తీసుకోవాల్సిన చర్యలపై గత వారం రోజులుగా ప్రధాని దాదాపు ప్రతి రోజూ ఉన్నత స్థాయి అధికారులు, వైద్యులు, శాస్త్రవేత్తలతో సమావేశమవుతున్నారు. పది అలాగే పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ సమావేశమయ్యారు. దేశంలో ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానల్లో కొత్త ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం పీఎం కేర్ నుంచి నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్, ఆక్సిజన్ ప్లాంట్లు, ట్యాంకర్ల ద్వారా ప్రాణవాయువును సరఫరా, దిగుమతి వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. నేడు జరిగే సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో వింత వాతావరణం..
బెంగాల్.. సస్పెన్స్ థ్రిల్లర్!
18+కు టీకాలెలా?
మ్డెసివిర్ ప్లీజ్!
‘స్పుత్నిక్ వీ’లో వైరస్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

