ముంబైలో మూడు రోజులు వ్యాక్సినేషన్ బంద్
ముంబైలో మూడు రోజులు వ్యాక్సినేషన్ బంద్ | మూడో దశ టీకాల పంపిణీ ప్రారంభానికి ముందే మహారాష్ట్రని ముంబైలో వ్యాక్సినేషన్ కేంద్రాలు మూతపడ్డాయి.

ముంబై : మూడో దశ టీకాల పంపిణీ ప్రారంభానికి ముందే మహారాష్ట్రని ముంబైలో వ్యాక్సినేషన్ కేంద్రాలు మూతపడ్డాయి. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ముంబైలో టీకాల పంపిణీ ఉండదని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. 18-45 ఏళ్ల వ్యక్తులకు మే ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్లు వేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసింది. కరోనా సెకండ్ వేవ్‌లో ఎక్కువగా యువతే మహమ్మారి బారినపడుతుండడంతో కేంద్రం వారికి సైతం వ్యాక్సిన్లు వేయాలని భావిస్తోంది. అయితే, వ్యాక్సిన్ల కొరత కారణంగా 18-45 ఏళ్ల వ్యక్తులకు వ్యాక్సినేషన్ ఆలస్యమవుతుందని అధికారులు తెలిపారు. టీకాల కొరత కారణంగా ముంబైలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు టీకాల పంపిణీ పూర్తిగా నిలిపివేస్తున్నట్లు బీఎంసీ నోటీసులో పేర్కొంది.
స్టాక్ వస్తే ప్రజలకు మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం ఇస్తామని తెలిపింది. టీకా కేంద్రాల వద్ద గుమిగూడొద్దని, పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ టీకా వేస్తామని స్పష్టం చేసింది. 18-45 ఏళ్ల మధ్య లబ్ధిదారులకు తగినంత టీకాలు లభించిన తర్వాతే పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని, ‘సరిగ్గా మే ఒకటిన కాదు’ అని బృహన్ ముంబై కార్పొరేషన్ అదనపు మున్సిపల్ కమిషనర్ అశ్విని భిడే ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 1.55 కోట్లకుపైగా వ్యాక్సిన్లు వేశారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో నిన్న ఒకే రోజు 66,159 కొవిడ్ కేసులు రికార్డవగా.. 771 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
రాష్ట్రంలో వింత వాతావరణం..
బెంగాల్.. సస్పెన్స్ థ్రిల్లర్!
18+కు టీకాలెలా?
మ్‌డెసివిర్ ప్లీజ్!
‘స్పుత్నిక్ వీ’లో వైరస్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

