సుబేదారి, మార్చి1 : మావోయిస్ట్ అగ్రనేత, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య అలియాస్ బాబన్న, అలియాస్ సుదర్శన్, అలియాస్ వికాస్ ఛత్త్తీస్గఢ్ పోలీసులకు లొంగిపోయారు. మావోయిస్ట్ పార్టీ ఛత్తీస్‌గఢ్- ఒడిశా సరిహద్దు ప్రాంతాల స్పెషల్ జోనల్ కీలక నేతగా కొనసాగుతున్న సాంబయ్య 14మందితో శనివారం రాత్రి అక్కడి పోలీసులకు సరెండర్ అయ్యారు. సాంబయ్య తొ మ్మిదో తరగతి చదువుతుండగానే 1984లో అప్పటి పీపుల్స్‌వార్ నేత క్రాంతి రణదేవ్ ప్రోత్సాహంతో పీపుల్స్‌వార్ పార్టీలో చేరినట్లు సాంబయ్య బాల్యమిత్రులు చెబుతున్నారు. సాంబయ్య తమ్ముడు నాగేశ్వర్రావు అన్న బాటలో పీపుల్స్‌వార్‌లో చేరి ఎన్కౌంటర్లో మృతిచెందాడు. బాబన్న పేరుతో ముప్పిడి సాంబయ్య 1988-1990 పీపుల్స్‌వార్ పార్టీలో పరకాల ప్రాంత తొలి దళ కమాండర్‌గా పనిచేశారు. ఆ సమయంలో బాబన్న దళం పేరుతో పరకాల, రేగొండ, ఆత్మకూర్, మొగుళ్లపల్లి మండలాల్లో రాజకీయ నాయకుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తించాడు. బాబన్న తర్వాత ఆర్కే పరకాల కమాండర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. 1995-96లో ఏటూరునాగారం డిప్యూటీ ప్లాట్ కమాండర్‌గా పనిచేశాడు. పార్టీ నిర్ణయం మేరకు 2000 తర్వాత దండకారణ్యం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లాడు. స్పెషల్ జోన్ కమిటీ నేతగా ఒడిశా రాష్ట్ర బాధ్యతల్లో కొనసాగుతున్నాడు.
తరాలపల్లి అప్పటి పీపుల్స్‌వార్, నేటి మా వోయిస్టులకు పురిటి గడ్డగా పేరొందింది. ఇదే గ్రామం నుంచి 1978లో పీపుల్స్‌వార్ -రైతు కూలీ సంఘంలో పనిచేసిన మొదటి తరం నేతల్లో ఒకరైన బండి ఆశాలు 1992లో ఖ మ్మం ఎన్కౌంటర్లో మృతిచెందాడు. తర్వా త ఉప్పలయ్య, శ్రీనాథ్, కౌముది, ముప్పిడి నాగేశ్వర్రావు, సంపత్ ఎన్కౌంటర్లలో మరణిచారు. ఏడాది క్రితం ఛత్తీస్‌గఢ్‌లో అంకేశ్వరం సారయ్య, అలియాస్ సుధీర్ ఎన్కౌంటర్లలో మృతిచెందారు. తాజాగా మావోయిస్ట్ అగ్రనేత ముప్పి డి సాంబయ్య రెండు రోజుల క్రితం 14 మందితో ఛత్తీస్‌గఢ్ పోలీసులకు లొంగిపోయారు. ఇటీవల కేంద్ర కమిటీ నేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, ములు గు జిల్లా కాల్వపల్లికి చెందిన దామోదర్ లొంగిపోయారు.
పెద్దపల్లి కమాన్, మార్చి 1: మావోయి స్టు పార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర కమిటీ అగ్రనేత, దండకారణ్య స్పెష ల్ జోనల్ కమిటీ చీఫ్ మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ సోనూదాదా అలియాస్ అభయ్ తన సొంతూరు పెద్దపల్లికి వచ్చారు. 44 ఏండ్లపాటు దండకారణ్యంలో సాయుధ పోరాటం చేసి, గత అక్టోబర్‌లో 60 మంది అనుచరులతో మహారా ష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ఆయుధాలు అప్పగించారు. తన పెద్దన్న ఆంజనేయులు ఇటీవల అనారోగ్యం పాలయ్యారని తెలియడంతో పరామర్శించేందుకు ఆదివారం పెద్దపల్లికి వచ్చారు. ఈ విషయం తెలిసి బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో చేరుకోగా వారితో కాసేపు ముచ్చటించారు. యోగక్షేమాలు తెలుసుకుని ఫొటోలు దిగా రు. మధ్యాహ్నం 3గంటల తర్వాత తిరిగి వెళ్లిపోయారు. మహారాష్ట్ర నుంచి వెంట వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం మల్లోజుల పర్యటనలో భాగంగా అక్కడి కదలికలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది.