హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విపత్తుల సమయంలో సహాయక చర్యలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర యువ ఆపద మిత్ర పథకాన్ని చేపట్టినట్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఎఫ్ఏసీ) స్పెషల్ సీఎస్ దాన కిశోర్ తెలిపారు. ఆదివారం ఓయూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి శ్రీనగేశ్తో కలిసి మాట్లాడారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘యువ ఆపద మిత్ర’లకు శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎకడ ఏ ప్రమాదం జరిగినా వలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొనడం వల్ల ప్రాణ, ఆస్తినష్టం తగ్గించవచ్చని వివరించారు. మాక్ డ్రిల్స్ తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు తెలిపారు.