Health tips | షుగర్ పేషెంట్లు ఎండాకాలంలో ఎలాంటి స్నాక్స్ తినాలో తెలుసా..?
Health tips | ఈ రోజుల్లో షుగర్ (Diabetis) సర్వసాధరమైన వ్యాధిగా మారిపోయింది. చిన్నాపెద్దా తేడా లేకుండా చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఒక్కసారి డయాబెటిస్ బారినపడితే దాని నుంచి పూర్తిగా బయటపడటం అసాధ్యం. ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు (Food habits), వ్యాయామం (Workout) లాంటి జాగ్రత్తలతో వ్యాధిని అదుపులో పెట్టుకోవడం ఒక్కటే మార్గం.
Health tips : ఈ రోజుల్లో షుగర్ (Diabetis) సర్వసాధరమైన వ్యాధిగా మారిపోయింది. చిన్నాపెద్దా తేడా లేకుండా చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఒక్కసారి డయాబెటిస్ బారినపడితే దాని నుంచి పూర్తిగా బయటపడటం అసాధ్యం. ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు (Food habits), వ్యాయామం (Workout) లాంటి జాగ్రత్తలతో వ్యాధిని అదుపులో పెట్టుకోవడం ఒక్కటే మార్గం. స్నాక్స్ విషయంలోనూ తినాల్సినవి, తినకూడనివి తెలుసుకుని తగిన జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న నేపథ్యంలో షుగర్ పేషెంట్లు ఎండాకాలంలో ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలో తెలుసుకుందాం..
పెసరపప్పు కూడా షుగర్ పేషెంట్లకు వేసవిలో మంచి ఆహారం. ఎందుకంటే పెసరపప్పులో ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందుకే పెసరపప్పు తినడంవల్ల డయాబెటిస్‌తోపాటు కడుపులో మంట కూడా తగ్గుతుంది. పెసరపప్పుతో పెరుగును కలుపుకుని పలు వెరైటీల్లో స్నాక్స్ చేసుకుని తినొచ్చు.
షుగర్ పేషెంట్లు వేసవిలో సులువుగా జీర్ణమయ్యే స్నాక్స్ తీసుకోవడం మంచిది. మొలకెత్తిన గింజలతో పెరుగును కలిపి సలాడ్ చేసుకొని తినడంవల్ల తేలికగా జీర్ణమవుతుంది. ఎందుకంటే మొలకెత్తిన గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది.
ఈ స్నాక్స్తోపాటు నిమ్మరసం, సల్ల, బత్తాయి పండ్లు, పుచ్చపండ్లు లాంటి నీరు ఎక్కువగా పండ్లను, పానీయాలను తరచూ తీసుకుంటే శరీరంగా కూల్ ఉండి, ఒంట్లో చక్కెర స్థాయిలో హెచ్చతగ్గులకు లోనుకాకుండా అదుపులో ఉంటాయి.
దోసకాయ ముక్కలను సలాడ్‌గా తీసుకోవడంవల్ల వేసవిలో వేడిగా ఉన్న శరీరం చల్లబడుతుంది. అలాగే దాహం కూడా తీరుతుంది. ఎందుకంటే దోసలో అధిక శాతం నీరే ఉంటుంది. అంతేగాక పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. పిండి పదార్థాలు, కేలరీలు తక్కువగా ఉంటాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

