UPI sevices | దేశమంతటా యూపీఐ సేవలకు తీవ్ర అంతరాయం.. ఇబ్బందులు ఎదుర్కొన్న యూజర్స్
UPI sevices | దేశంలో డిజిటల్ చెల్లింపు (Digital Payment) సేవలకు బుధవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. యూపీఐ ప్లాట్‌ఫామ్స్ (UPI platforms) ద్వారా లావాదేవీలు చేసేందుకు ప్రయత్నించిన అనేక మంది వినియోగదారులు ట్రాన్సెక్షన్లు సరిగా జరుగక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవల్లో సమస్య ఎక్కువగా కనిపించింది.
UPI sevices : దేశంలో డిజిటల్ చెల్లింపు (Digital Payment) సేవలకు బుధవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. యూపీఐ ప్లాట్‌ఫామ్స్ (UPI platforms) ద్వారా లావాదేవీలు చేసేందుకు ప్రయత్నించిన అనేక మంది వినియోగదారులు ట్రాన్సెక్షన్లు సరిగా జరుగక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవల్లో సమస్య ఎక్కువగా కనిపించింది. ఔటేజ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్‌డిటెక్టర్ (Down Detector) ప్రకారం.. ఒక్కసారిగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఒక్క ఎస్బీఐ ఖాతాదారుల నుంచే 500కు పైగా ఔటేజ్ రిపోర్టులు రాగా.. యూకో బ్యాంకుకు సంబంధించి దాదాపు 40 ఫిర్యాదులు నమోదయ్యాయి. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, జైపూర్, పుణె వంటి ప్రధాన నగరాలతోపాటు కోల్‌కతా, గువాహటి, చెన్నై నుంచి కూడా వినియోగదారులు లావాదేవీలు విఫలమయ్యాయని ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్యపై చాలామంది ఎక్స్ వేదికగా తమ అసహనాన్ని వ్యక్తంచేశారు. కొందరి లావాదేవీలు మధ్యలోనే ఆగిపోగా, మరికొందరి యూపీఐ యాప్‌లు పూర్తిగా లోడ్ కాలేదు.
అయితే ఈ అంతరాయంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. షెడ్యూల్ ప్రకారం చేపట్టిన నిర్వహణ పనుల సమయాన్ని ఏప్రిల్ 1వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటల వరకు పొడిగించినట్లు తెలిపింది. ఈ సమయంలో యూపీఐ, ఐఎంపీఎస్, యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవల్లో అంతరాయం కలుగవచ్చని పేర్కొన్నది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, వినియోగదారులు యూపీఐ లైట్, ఈ-రూపీ (సీబీడీసీ) యాప్, ఏటీఎం సేవలను ప్రత్యామ్నాయంగా వాడుకోవాలని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

