హైదరాబాద్ : కేరళం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి లెఫ్ట్ ఫ్రంట్ మీద నోరుపారే సుకున్నారు. సీపీఐ, సీపీఎం పార్టీల లెఫ్ట్ ఫ్రంట్ కు ఓటు వేస్తే నరేంద్ర మోదీకి వేసినట్టే అని రేవంత్ అన్నారు. కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్, నరేంద్ర మోదీకి నీడ లాంటి వాడు అని, వాళ్లిద్దరూ అన్నదమ్ముల లాంటివారు అని విచిత్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఖమ్మం వెలుగుమట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి ఇళ్లు కూల్చిన అంశం మీద పినరయి విజయన్ ఇటీవల విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
దీంతో కక్ష పెంచుకున్న రేవంత్ రెడ్డి రెండు రోజుల కేరళ ప్రచారంలో భాగంగా ఇవాళ సీపీఐ, సీపీఎం లెఫ్ట్ ఫ్రంట్‌ను టార్గెట్ చేసి మాట్లాడాడు. సీపీఐతో తెలంగాణలో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం నడుపుతున్నామన్న విషయం మర్చిపోయినట్లు నటిస్తున్న రేవంత్ రెడ్డి తీరు చూసి రాజకీయవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతున్నది. అవకాశవాదానికి ఇది పరాకాష్ట అని పలువురి కామెంట్ చేస్తున్నారు.
కేరళంలో లెఫ్ట్ ఫ్రంట్ మీద నోరుపారేసుకున్న రేవంత్
సీపీఐ, సీపీఎం పార్టీల లెఫ్ట్ ఫ్రంట్ కు ఓటు వేస్తే నరేంద్ర మోదీకి వేసినట్టే అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, నరేంద్ర మోదీకి నీడ లాంటి వాడు అని, వాళ్లిద్దరూ అన్నదమ్ముల లాంటివారు అని విచిత్ర వ్యాఖ్యలు… pic.twitter.com/r4uRfdQvXQ
— Telugu Scribe (@TeluguScribe) April 1, 2026