శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 27, 2020 , 15:12:58

అమెరికా మంత్రుల‌కు ఇలా విషెస్ చెప్పిన ధోవ‌ల్‌..

అమెరికా మంత్రుల‌కు ఇలా విషెస్ చెప్పిన ధోవ‌ల్‌..

హైద‌రాబాద్‌: క‌రోనా వేళ హ్యాండ్‌షేక్‌లు లేవు.  కొంద‌రు దూరం నుంచే విష్ చేసుకుంటున్నారు.  కొంద‌రు న‌మ‌స్తే చెప్పుకుంటున్నారు.  అయితే ఇవాళ నేష‌న‌ల్ సెక్యూర్టీ అడ్వైజ‌ర్ అజిత్ ధోవ‌ల్‌.. అమెరికా మంత్రుల‌కు వెరైటీగా విష్ చేశారు.  భార‌త్ టూర్‌లో ఉన్న అమెరికా మంత్రులు మైక్ పొంపియో, మార్క్ ఎస్ప‌ర్‌ల‌ను ధోవ‌ల్ క‌లిశారు. ఆ స‌మ‌యంలో వారు క‌ర‌చాల‌నం చేయ‌లేదు.  న‌మ‌స్తే కూడా ఇచ్చుకోలేదు.  ఆ ఇద్ద‌రు అమెరికా మంత్రుల‌కు ధోవ‌ల్ కొత్త‌గా ఎల్బో బంప్ ఇచ్చారు.  త‌న మోచేయితో  వారి మోచేయిల‌ను తాకుతూ వెల్క‌మ్ చెప్పారు ధోవ‌ల్‌.  సైనిక ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా మంత్రులిద్ద‌రూ సోమ‌వార‌మే ఇండియా వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  ఇవాళ సౌత్ బ్లాక్‌లో స‌మావేశానికి ముందు ఆ ఇద్ద‌ర్నీ ధోవ‌ల్ క‌లిశారు. ఆ స‌మ‌యంలో పొంపియో, మార్క్ ఎస్ప‌ర్‌తో మోచేయి విషెస్ చెప్పిన ధోవ‌ల్ ఉషారుగా క‌నిపించారు.