వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనాదరులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | వాహనదారులకు చమురు కంపెనీలు మళ్లీ షాక్ ఇచ్చాయి. రెండు రోజుల తర్వాత సోమవారం మరోసారి ధరలను పెంచాయి.

న్యూఢిల్లీ : వాహనదారులకు చమురు కంపెనీలు మళ్లీ షాక్ ఇచ్చాయి. రెండు రోజుల తర్వాత సోమవారం మరోసారి ధరలను పెంచాయి. పెట్రోల్‌పై లీటర్‌కు 26 పైసలు, డీజిల్ లీటర్‌కు 33 పైసలు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.53కు చేరుకుంది. డీజిల్ లీటర్‌కు రూ.82.06కు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.97.86, డీజిల్ రూ.89.17, చెన్నైలో పెట్రోల్ రూ.93.38, డీజిల్ రూ.86.93, కోల్‌కతాలో పెట్రోల్ రూ.91.66, డీజిల్ రూ.84.90, హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.95.13కు, డీజిల్ ధర రూ.89.47కు చేరాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.25 శాతం పెరుగుదలతో 69.07 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 1.11 శాతం పెరుగుదలతో 65.62 డాలర్లకు పెరిగింది.
సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ క్రమంలో పెరుగుతూ, తగ్గుతుంటాయి.. లేదంటే స్థిరంగా కొనసాగుతూ వస్తుంటాయి. ఇటీవల వరుసగా నాలుగు రోజులుగా ధరలు పెరగ్గా.. రెండు రోజుల పాటు పెంచకపోవడంతో వాహనదారులు ఊరట కలిగింది. ఇప్పటికే దేశంలో పలు చోట్ల ధరలు రూ.100 దాటాయి. ఈ క్రమంలో మళ్లీ ధరలు పెరుగడంతో వాహనాలు బయటకు తీసేందుకే బెంబేలెత్తి పోతున్నారు. ఓ వైపు కొవిడ్ మహమ్మారి వేళ ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంపై సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ లక్షణాలు ఉంటే బ్లాక్ ఫంగస్
పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
అమెరికాలో కాల్పుల కలకలం.. రెండు ఘటనల్లో 11 మంది మృతి
అసోం సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న హిమంత
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ.. ఎన్నికల ఫలితాలపై మేథోమధనం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

