రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మవోయిస్టుల చేతిలో ఎస్ఐ మురళి తాతీ మరణించిన ఘటన మరువకముందే మరో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) కనిపించకుండా పోయాడు. గత నాలుగురోజులుగా ఏఎస్ఐ క్రిస్టొఫర్ లక్రా ఆచూకీ లభించడంలేదని ఎస్పీ కవర్ధా తెలిపారు. లక్రా పండరిపని సీఏపీ క్యాంప్‌లో విధులు నిర్వర్తిస్తున్నారని, ఆయన ఈనెల 21 నుంచి కనిపించడంలేదని చెప్పారు. చివరిసారిగా ఆయనను స్థానిక అటవీ ప్రాంతంలో చూశామని క్యాంప్ సమీపంలోని గ్రామస్థులు తెలిపారని వెల్లడించారు. ఏఎస్ఐ ఆచూకీ కోసం గాలింపు చేపట్టామని ఎస్పీ చెప్పారు. బీజాపూర్ జిల్లాలో ఎస్ఐని మావోయిస్టులు హతమార్చిన మరుసటి రోజే ఈ వార్త వెలుగులోకి రావడం గమనార్హం.
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్ మురళి తాతీని మావోయిస్టులు నిన్న కాల్చి చంపారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పుల్సుమ్‌పారా వద్ద వదిలేసి వెళ్లిన విషయం తెలిసిందే. గంగలూర్‌లో పని చేస్తున్న మురళి సెలవులో ఉండగా.. బీజాపూర్ జిల్లాలోని తన గ్రామం పల్నూర్‌లో గత బుధవారం అపహరణకు గురయ్యారు.
APC (ASI) Christopher Lakra who is posted at Pandaripani CAP camp has been missing since April 21. Locals of nearby villages have confirmed to have seen him near jungle area. We are seraching for him: Shalabh Sinha, SP Kawardha, Chhattisgarh (24/4) pic.twitter.com/GoOWaAgYQU
— ANI (@ANI) April 25, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..