ఢిల్లీలో మరోవారం లాక్డౌన్ పొడిగింపు
ఢిల్లీలో మరోవారం లాక్డౌన్ | ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మరో వారం రోజుల పాటు పొడిగినట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మే

న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మరో వారం రోజుల పాటు పొడిగినట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మే 3(సోమవారం) ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో కరోనా ఉధృతి ఇంకా తగ్గలేదు. నిన్న రికార్డు స్థాయిలో 357 మరణాలు సంభవించాయని తెలిపారు.
ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆక్సిజన్ సరఫరా, నిర్వహణకు పోర్టల్ ప్రారంభించామని తెలిపారు. తయారీదారులు, సరఫరాదారులు, ఆస్పత్రులతో కలిసి ఈ పోర్టల్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి ఆక్సిజన్ వివరాలు అప్డేట్ అవుతాయన్నారు. ఢిల్లీ ప్రజలతో మాట్లాడినప్పుడు కూడా లాక్డౌన్ పొడిగించాలనే కోరారు అని కేజ్రీవాల్ వెల్లడించారు.
We had imposed a 6-day lockdown in Delhi. The lockdown is being extended to next Monday till 5 am: Delhi CM Arvind Kejriwal #COVID19 pic.twitter.com/s1eHgZmaHN
— ANI (@ANI) April 25, 2021
ఇవికూడా చదవండి..
కొవిడ్ హాస్పిటల్లో మంటలు.. 23 మంది రోగుల మృతి
జూన్‌కల్లా సాధారణ స్థాయికి!
ఆక్సిజన్ కావాలా.. మొక్క నాటండి!
రిస్క్ చేశారు.. అందుకే తక్కువ ధర
వైరస్‌తో ఎంత వినాశనమో.. భారత్‌ను చూస్తే తెలుస్తుంది
శ్రీలంకలో ప్రమాదకర కొత్త కరోనా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

