జూన్‌కల్లా సాధారణ స్థాయికి!

ఈ నెలాఖరుకు పీక్ స్టేజ్‌కు కరోనా కేసులు
సెకండవేవ్ వ్యవధి తక్కువైనా.. ఉద్ధృతి ఎక్కువ
పలువురు నిపుణుల అంచనాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: దేశంలో కరోనా సెకండ్ వేవ్ అంతకంతకూ ఉద్ధృతమవుతున్నది. రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతాయి. సెకండ్ వేవ్ తక్కువ వ్యవధితో ఎక్కువ ఉద్ధృతితో కొనసాగనున్నదని వైరాలజిస్ట్ జాకబ్ జాన్, బయోఎథిక్స్, పాలసీ నిపుణులు ఆనంద్, సాంక్రమిక వ్యాధినిపుణులు డేవిడ్ హేమన్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఏప్రిల్ చివరినాటికి కేసులు గరిష్ఠస్థాయికి చేరకుంటాయని అంచనా వేశారు. జూన్‌నాటికి ఎండెమిక్ స్టేజ్‌కి (కేసులు సాధారణ స్థాయికి రావడం) వస్తాయని పేర్కొన్నారు. వైరస్ ఉత్పరివర్తనం చెంది వేగంగా వ్యాపించడం, ప్రజలు, రాజకీయ నాయకులు కరోనా మార్గదర్శకాలు పాటించకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే కేసులు భారీగా పెరుగుతున్నాయని వివరించారు. దేశంలో వైరస్ సీక్వెన్సింగ్ తగిన విధంగా జరుగడం లేదని, ఇది వ్యవస్థాగతమైన లోపమని పేర్కొన్నారు. బ్రిటన్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున సీక్వెన్సింగ్ నిర్వహిస్తున్నారని వెల్లడించారు. వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వడం ద్వారా ఉత్పరివర్తనాలను చాలా వరకు ఎదుర్కొనవచ్చని పేర్కొన్నారు. వైరస్‌తో కలిసి జీవించడం తప్పదన్నారు. మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడం అతిపెద్ద సవాల్ అని, పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ద్వారానే వైరస్‌ను నియంత్రించగలమని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

