ఆక్సిజన్ కొరత.. ఆ దవాఖానలో మరోసారి ఆందోళన
ఆక్సిజన్ కొరత| దేశ రాజధానిలోని దవాఖానల్లో ఆక్సిజన్ కొరత ఆందోళనకలిగిస్తున్నది. ఢిల్లీలోని ప్రముఖ హాస్పిటల్ సర్ గంగారామ్ దవాఖానలో ఆక్సిజన్ నిల్వలు అడుగంటుతుండటంతో శనివారం రాత్రి 10:30 గంటలకు దవాఖాన అధికారులు

దిల్లీ: దేశ రాజధానిలోని దవాఖానల్లో ఆక్సిజన్ కొరత ఆందోళనకలిగిస్తున్నది. ఢిల్లీలోని ప్రముఖ హాస్పిటల్ సర్ గంగారామ్ దవాఖానలో ఆక్సిజన్ నిల్వలు అడుగంటుతుండటంతో శనివారం రాత్రి 10:30 గంటలకు దవాఖాన అధికారులు ప్రభుత్వానికి అత్యవసరంగా మెసేజ్ (ఎస్ఓఎస్) పంపారు. అప్పటికి కేవలం గంటకి సరిపడా ప్రాణవాయువు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. 130 మంది రోగులు ఐసీయూలో ఉన్నారని, మరో 30 మంది వెంటిలేటర్‌పై ఉన్నారని అందులో పేర్కొన్నారు.

దీంతో అప్రమత్తమైన స్థానిక ఎమ్మెల్యే రాఘవ్ చద్దా అధికారులతో మాట్లాడి ఆక్సిజన్ ట్యాంకర్‌ను తెప్పించారు. అది శనివారం అర్ధరాత్రి 12:20 గంటలకు ఒక మెట్రిక్ టన్ను ఆక్సిజన్ దవాఖానకు చేరింది. అయితే ఆ ఆక్సిజన్ రెండు గంటలకు మాత్రమే సరిపోతుందని దవాఖాన అధికార ప్రతినిధి 12:45 గంటలకు వెళ్లడించారు. కాగా, గంగారాం హాస్పిటల్‌కు ఫరీదాబాద్‌లోని ఒక పంపిణీదారుడు ఆక్సిజన్ పంపిచాలి. తెల్లారుజామున 3 గంటల ప్రాంతంలో ట్యాంకర్లు దవాఖానకు చేరాల్సిఉండగా.. గంటబావు ఆలస్యంగా 4:15 గంటల సమయంలో 5 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఆక్సిజన్ ట్యాంకర్లు అక్కడికి వచ్చాయి. అదికూడా 11 నుంచి 12 గంటలు మాత్రమే సరిపోతుందని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఒత్తిడికి తలొగ్గిన అమెరికా.. భారత్‌కు అత్యవసర మందులు, వ్యాక్సిన్లు
వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు.. 99 రోజుల్లో 14 కోట్ల డోసుల పంపిణీ
ఆక్సిజన్ కావాలా.. మొక్క నాటండి!
తమిళనాడులో సండే లాక్డౌన్.. రేపట్నుంచి ఆ సేవలన్నీ బంద్..!
కర్ఫ్యూ సడలింపు వేళల్లో షాపుల ముందు జనం బారులు..!
10 శాతం పాజిటివ్ రేటు ఉంటే లాక్డౌన్: ఎయిమ్స్ చీఫ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

