వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు.. 99 రోజుల్లో 14 కోట్ల డోసుల పంపిణీ
వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు | కొవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు సాధించింది. ప్రపంచంలోనే వేగంగా టీకాలు పంపిణీ చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

న్యూఢిల్లీ : కొవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు సాధించింది. ప్రపంచంలోనే వేగంగా టీకాలు పంపిణీ చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. కేవలం 99 రోజుల్లోనే 14 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు కేంద్రం పేర్కొంది. శనివారం రాత్రి రాత్రి 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 14,08,02,794 మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఇందులో 92.89లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్లకు మొదటి డోసు, 59.94లక్షల మందికి రెండో డోసు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు 1.19 మొదటి మోతాదు, 62.77లక్షల డోసులు రెండో మోతాదు అందించినట్లు చెప్పింది. 45-60 వయస్సు వారికి 4.76 కోట్లు మొదటి డోసు, 23.22 మందికి రెండో మోతాదు అందించినట్లు చెప్పింది.

60 ఏళ్లు పైబడిన వ్యక్తుల్లో 4.96 కోట్ల మందికి మొదటి డోసు, 77.02లక్షల మందికి రెండో డోసు వేసినట్లు వివరించింది. ప్రపంచంలోనే తొలిసారిగా మెగా టీకా డ్రైవ్ దేశంలో ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదట హెల్త్ కేర్ వర్కర్ ఆ తర్వాత ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వృద్ధులకు ప్రాధాన్యం ఇచ్చింది. అనంతరం 45 ఏళ్లుపైబడి దీర్ఘకాలిక సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ వేస్తూ వస్తోంది. మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లుపైబడిన వారికి టీకాలు వేయనుంది. ప్రస్తుతం దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లను అత్యవసర వినియోగం కింద కేంద్రం వినియోగిస్తోంది. తాజాగా స్పుత్నిక్ వీ, జైడస్ క్యాడిలా ‘విరాఫిన్’ వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ఈ రెండు వ్యాక్సిన్లు సైతం అందుబాటులోకి వస్తే టీకా పంపిణీ మరింత వేగవంతం కానున్నది.
ఇవికూడా చదవండి..
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
నర్సింగ్ కళాశాలలో 93 మంది విద్యార్థులకు పాజిటివ్
తిరుపతిలో జనంపైకి దూసుకెళ్లిన బస్సు.. ఒకరు మృతి
కరోనా ఐసోలేషన్ వార్డులుగా రైల్వే బోగీలు.. అందుబాటులో 3,816 కోచ్‌లు
జూన్‌కల్లా సాధారణ స్థాయికి!
ఆక్సిజన్ కావాలా.. మొక్క నాటండి!
రిస్క్ చేశారు.. అందుకే తక్కువ ధర
వైరస్‌తో ఎంత వినాశనమో.. భారత్‌ను చూస్తే తెలుస్తుంది
శ్రీలంకలో ప్రమాదకర కొత్త కరోనా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

