Crime news : ఆర్టీసీ బస్సు (RTC Bus) లో కండక్టర్ (Conductor) పట్ల కొందరు ప్రయాణికులు అమానుషంగా వ్యవహరించారు. టికెట్ విషయంలో గొడవ పెట్టుకుని, మరాఠీలో మాట్లాడాలంటూ దాడికి పాల్పడ్డారు. కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని బెళగావి (Belagavi) పట్టణంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. దాడిలో గాయపడిన కండక్టర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (KSRTC) కు చెందిన బస్సు బెళగావి మీదుగా వెళ్తుండగా కండక్టర్ మహదేవ్ హుక్కెరి (Mahadev Hukkeri) కి, ప్రయాణికులకు మధ్య గొడవ జరిగింది. బస్సు ఎక్కిన భర్త, భార్య టికెట్ విషయంలో గొడవ పెట్టుకున్నారు. కండక్టర్‌ను మహిళ రెండు ఫ్రీ టికెట్లు అడగడంతో మరో ఫ్రీ టికెట్ ఎవరికని ప్రశ్నించాడు. దాంతో ఆమె తన భర్తను చూపించింది. అయితే ఫ్రీ టికెట్ ఆడవాళ్లకు మాత్రమేనని, మగవాళ్లకు కాదని కండక్టర్ బదులిచ్చాడు.
దాంతో నువ్వు ముందుగా మరాఠీలో మాట్లాడు అంటూ వాళ్లు గొడవకు దిగారు. అందుకు బదులుగా కండక్టర్ తనకు మరాఠీ రాదని, మీరే కన్నడలో మాట్లాడాలని చెప్పాడు. కండక్టర్ సమాధానంతో ఆగ్రహించిన దంపతులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. బస్సులో ఉన్న మరో ఐదారుగురు మరాఠీలు కూడా వారికి జత కలిశారు. అంతటితో ఆగకుండా ఫోన్ల ద్వారా ముందు స్టాప్‌కు మరో 50 మందిని పిలిపించి మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెళగావిలో మరాఠీల ఆగడాలు పెరిగిపోతున్నాయని కన్నడిగులు విమర్శలు గుప్పిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
#WATCH | Karnataka: A KSRTC bus conductor beaten up allegedly for not speaking in Marathi, in Belagavi
Mahadev Hukkeri, KSRTC conductor, says, ” …A woman and a man were sitting in the bus, majority of the passengers in the bus were women, I was distributing tickets, in… pic.twitter.com/YB2pAMVkIM
— ANI (@ANI) February 22, 2025
Bhutan PM | ఆయనలో నా అన్నను చూసుకుంటున్నా.. మోదీ నాయకత్వంపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
PM Modi | దేశంలో ‘ఛావా’ హవా నడుస్తోంది.. విక్కీ కౌశల్ సినిమాపై ప్రధాని ప్రశంసలు
Alia Bhatt | చాలా బాగున్నావు.. ముఖ్యంగా నీ కళ్లు.. ఆ హీరోయిన్ని పొగడ్తలతో ముంచెత్తిన అలియా భట్
Brazil Nuts | థైరాయిడ్ ఉన్నవారికి వరం.. ఈ నట్స్.. ఇంకా ఎన్నో లాభాలు..!
Kamal Haasan | భాషతో ఆటలొద్దు.. హిందీ వివాదంపై కమల్ హాసన్ హెచ్చరిక