బుధవారం 03 జూన్ 2020
National - May 14, 2020 , 15:59:16

దేశంలో రెండేండ్ల తర్వాతే 5జీ సర్వీసులు!

దేశంలో రెండేండ్ల తర్వాతే 5జీ సర్వీసులు!

న్యూఢిల్లీ: దేశంలో 5 జీ సర్వీసులు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. కరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవడంతో 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించడానికి మరో రెండేండ్లు పట్టే అవకాశం ఉందని టెలికం శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. టెలికం శాఖ ఈ వారం ప్రారంభంలో నిర్వహించిన సమావేశంలో దేశంలో 5 జీ స్పెక్ట్రమ్‌ వేలం ఆలస్యానికి సంబంధించి చర్చకు వచ్చినట్లు తెలిసింది. కరోనా వైరస్‌ వల్ల 2021 వరకు వేలం నిర్వహించే అవకాశం లేదని అధికారులు అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో 5 జీ ట్రయల్స్‌ కూడా ఆలస్యమవడంతో దేశంలో ఈ నెట్‌వర్క్‌ అందుబాటులోకి రావడానికి 2022 వరకు ఆగాల్సి ఉంటుంది.


logo