e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home క్రైమ్‌ దవాఖానలో అగ్నిప్రమాదం.. నలుగురు రోగులు మృతి

దవాఖానలో అగ్నిప్రమాదం.. నలుగురు రోగులు మృతి

దవాఖానలో అగ్నిప్రమాదం.. నలుగురు రోగులు మృతి

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఒకవైపు వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌ కొరత వేధిస్తుండగా మరోవైపు దవాఖానల్లో వరుస ప్రమాదాలతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా థానేలోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అందులో చికిత్స పొందుతున్న నలుగురు రోగులు మృతిచెందారు.

థానేలోని ముంబ్రా ప్రాంతంలో ఉన్న ప్రైమ్‌ క్రిటికేర్‌ హాస్పిటల్‌లో బుధవారం తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి దవాఖాన అంతా విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. రోగులను ఇతర హాస్పిటళ్లకు తరలిస్తుండగా నలుగురు మృతిచెందారని థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

దేశంలో 2 లక్షలు దాటిన కరోనా మరణాలు
రోజువారీ కేసుల్లో 38% ఇండియాలోనే
బ్లాక్‌ మార్కెట్లో ఆక్సిజన్‌… అయినా పట్టించుకోరా?
మరణాల్లో పెరుగుదలకు డబుల్‌ మ్యుటెంట్‌కు లింక్‌ లేదు!
ప్రేక్షక పాత్ర పోషించలేం!
భారత్‌కు తక్షణ సహాయం : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌
కరోనా వ్యాక్సిన్‌ పేటెంట్‌ తీసెయ్యాలి!
భారత్‌కు అండగా దలైలామా


Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దవాఖానలో అగ్నిప్రమాదం.. నలుగురు రోగులు మృతి

ట్రెండింగ్‌

Advertisement