బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్… అయినా పట్టించుకోరా?

- కరోనా చర్యల్లో మీరు విఫలం
- ఆప్ సర్కార్‌పై ఢిల్లీ హైకోర్టు మండిపాటు
- రెమ్‌డెసివిర్ కొరతపై కేంద్రానికి చురకలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్లోకి తరలిపోతున్నదని ఢిల్లీ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. రోగులకు అవసరమైన మందులను కూడా కొందరు దొడ్డిదారిన ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారని, అయినప్పటికీ, ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని మండిపడింది. కరోనా నియంత్రణ చర్యల్లో ఢిల్లీ సర్కార్ విఫలమైందని తీవ్ర స్వరంతో మందలించింది. ఆక్సిజన్ కొరతతో దవాఖానలు, నర్సింగ్ హోమ్‌లలో మరణించిన వారి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆక్సిజన్ రీఫిల్లింగ్ సెంటర్లపై కూడా కోర్టు ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సంక్షోభ సమయంలో రాబందుల్లా ప్రవర్తించవద్దన్నది. మరోవైపు, ఢిల్లీ హైకోర్టు జడ్జిలు, వారి కుటుంబసభ్యుల కోసం ఫైవ్ స్టార్ హోటల్‌ను 100 పడకల కొవిడ్ కేంద్రంగా మార్చడంపై ప్రభుత్వంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అలా మార్చాలని తాము చెప్పలేదని పేర్కొంది. ఇదిలా ఉండగా, కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు ఇచ్చే రెమ్‌డెసివిర్ ఔషధం కొరతతో వేలాది మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలో ఎన్నో కంపెనీలు ఆ ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, లక్షల వయల్స్ విదేశాలకు ఎగుమతవుతున్నప్పటికీ, దేశ ప్రజలకు మాత్రం ఆ ఔషధం దక్కడంలేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

