న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సోమవారం నమోదైన కరోనా కేసుల్లో భారత్ నుంచే 38% కేసులు ఉన్నాయి. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి మొత్తం కేసుల్లో ఒక దేశం కేసుల వాటా ఇంత భారీగా ఉండటం ఇదే తొలిసారి. జాన్స్ హాప్కిక్స్ వర్సిటీ ప్రకారం… సోమవారం ప్రపంచవ్యాప్తంగా 6.9 లక్షల కేసులు నమోదు కాగా ఇండియాలో 3.23 లక్షల కేసులు నమోదయ్యాయి.