బుధవారం 08 జూలై 2020
National - Jun 23, 2020 , 20:04:20

లాక్ డౌన్ ఉల్లంఘ‌న‌లు.. 27 వేల మంది అరెస్ట్

లాక్ డౌన్ ఉల్లంఘ‌న‌లు.. 27 వేల మంది అరెస్ట్

ముంబై : మ‌హారాష్ర్ట‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి అధికంగా ఉన్న నేప‌థ్యంలో అక్క‌డ లాక్ డౌన్ ను పోలీసులు ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తున్నారు. లాక్ డౌన్ ఉల్లంఘ‌న‌ల‌కు సంబంధించి 1.34 ల‌క్ష‌ల కేసులు న‌మోదు చేశారు. 27 వేల మందిని అరెస్టు చేశారు. ఈ కేసుల‌న్ని మార్చి 22 నుంచి జూన్ 22 మ‌ధ్య న‌మోదు అయిన‌ట్లు ఆ రాష్ర్ట హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు. లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారి నుంచి రూ. 8,64,19,878లు వ‌సూలు చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. అత్య‌వ‌స‌ర సేవ‌ల కింద 5,04,031 పాసులను పోలీసులు జారీ చేశార‌ని దేశ్ ముఖ్ పేర్కొన్నారు. 

తాజావార్తలు


logo