హోంలోన్ భారం వేగంగా క్లియర్ కావాలంటే..!
హోంలోన్ భారం ఇంటి రుణ చెల్లింపులు శరవేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారా? నెలవారీ వాయిదాలు, వడ్డీరేటు భారాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నారా.. ...

న్యూఢిల్లీ: మీరు ఇంటి రుణ చెల్లింపులు శరవేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారా? నెలవారీ వాయిదాలు, వడ్డీరేటు భారాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నారా.. అయితే, అందుకో మార్గం ఉంది.
కరోనా రెండో వేవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా ఉండేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) తొలి ద్వైవార్షిక ద్రవ్య విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. రెపోరేట్ నాలుగు శాతంగా కొనసాగించాలని తీర్మానించింది.
రెపోరేటు నాలుగు శాతానికి పరిమితం కావడంతో పలు వాణిజ్య బ్యాంకులు అతి తక్కువ వడ్డీరేటుపై ఇంటి రుణాలు మంజూరు చేస్తున్నాయి. అత్యధిక బ్యాంకుల్లో ఇంటి రుణాలు ఏడు శాతం వడ్డీరేటు వద్ద మొదలవుతున్నాయి.
ఎంసీఎల్ఆర్-ఆర్ఎల్ఎల్ఆర్ ఆధారిత రుణాలిలా..
ఆర్బీఐ 2016 ఏప్రిల్ ఒకటో తేదీన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ను ప్రవేశపెట్టింది. అన్ని రుణాలకు బేస్‌రేట్‌ను నిర్ధారిస్తూ వాణిజ్య బ్యాంకులు తమ సొంత వనరులపై ఆధారపడి మంజూరు చేసేవే ఎంసీఎల్ఆర్ రుణాలు.
ఎంసీఎల్ఆర్ కింద రుణాలు పొందిన రుణగ్రహీతలకు ఆర్బీఐ ఖరారు చేసే రెపోరేట్ ప్రయోజనాలను రుణ గ్రహీతలకు చేరవేయడంలో బ్యాంకులు జాప్యం చేసేవి.
దీని నివారణకు రెపోరేట్‌కు అనుగుణంగా అన్ని బ్యాంకులు రుణాలు మంజూరు చేసేందుకు ఆర్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రుణాల విధానం తెచ్చింది. 2019 అక్టోబర్ నుంచి అన్ని బ్యాంకులు ఇచ్చే రుణాల వడ్డీరేట్లను ఫైనాన్సియల్ బెంచ్‌మార్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌బీఐఎల్) ప్రచురిస్తుంది.
ఎంసీఎల్ఆర్ లేదా రెపోలింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్)ల్లో దేని పరిధిలోకి మీ రుణం వస్తుందన్న దాన్ని బట్టి మీరు వడ్డీరేటును ఖరారు చేసుకోవచ్చు. నెలసరి వాయిదా భారాన్ని తగ్గించుకోవచ్చు.
2019 ఏప్రిల్‌కు ముందు ఎంసీఎల్ఆర్ విధానం కింద ఇంటి రుణాలు పొందిన వారు ఆ పద్దతిలోనే కొనసాగొచ్చు. అయితే, ఎంసీఎల్ఆర్ నుంచి ఆర్ఎల్ఎల్ఆర్కు మారితే రుణ గ్రహీతల భారం తగ్గుతుంది.
అయినప్పటికీ ఎంసీఎల్ఆర్ రుణాలు తీసుకున్నా.. మీరు రుణం చెల్లించాల్సిన గడువును బట్టి నెలవారీ వాయిదా చెల్లింపుల మొత్తం తగ్గించుకోవచ్చు.
నెలవారీ వాయిదాల తగ్గింపు ఇలా
మీరు తీసుకున్న రుణాలపై ఒక్కశాతం వడ్డీరేటు తగ్గినా చెల్లించాల్సిన నెలసరి రుణ వాయిదా తగ్గడంతోపాటు మొత్తం వడ్డీ భారం నుంచి బయట పడొచ్చు. నూతన రుణాలు తీసుకున్నప్పుడు మాత్రమే తక్కువ వడ్డీరేట్లతో కూడిన లోన్ల కోసం వెళ్లొచ్చు.
వడ్డీరేట్లు తగ్గించుకోవడానికి మరో మార్గం కూడా ఉంది. నిరంతర (నిర్ధిష్ఠ) వాయిదాల్లో ముందస్తు చెల్లింపుల ద్వారా వడ్డీరేట్ల భారం తగ్గించుకోవచ్చు. ప్రతి ఆరు నెలలకోసారి లేదా ఏడాదికోసారి కొంత మొత్తం అదనంగా చెల్లించడంతో మీరు చెల్లించాల్సిన మిగతా రుణ భారం తగ్గుతుంది.
రుణాలు తీసుకున్న ప్రారంభంలోనే ముందస్తు చెల్లింపులు చేస్తే బావుంటుంది. ప్రారంభంలో అధిక వడ్డీరేటు అమలవుతున్న వారికి ముందస్తు చెల్లింపుల వల్ల వడ్డీ భారం తగ్గుతుంది.
రుణాలు కొత్తగా తీసుకునే వారు తప్పనిసరిగా ఆయా బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న బెస్ట్ వడ్డీరేట్లను తప్పనిసరిగా సమీక్షించుకోవాలి.
రెపోరేట్ పెరిగినప్పుడు ఎంసీఎల్ఆర్ విధానంలో లోన్ తీసుకున్న వారి కంటే ఆర్ఎల్ఎల్ఆర్ లింక్డ్ రుణాలు తీసుకున్న వారిపై ఎక్కువ ప్రభావం పడుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మళ్లీ కొండెక్కుతున్న పసిడి ధరలు
కొవిడ్ రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతోంది: కేంద్రం
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్‌పై అవగాన..!
ఈ లక్షణం ఉంటే పుట్టేది ఆడపిల్లే
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
వేసవిలో మామిడిపండ్లు తినొచ్చా ?
‘పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
రఫేల్ డీల్‌తో దేశానికి రూ 21,000 కోట్ల నష్టం : కాంగ్రెస్
ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చడమెలా
పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
మీ ఆధార్‌ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
ఆధార్ నంబర్ మర్చిపోయారా? ఇలా తెలుసుకోండి
పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు పొందడమెలా
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- emi
- home loans
- interest
- repayments
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

