e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 25, 2021
Home News పుష్ప‌పై కాపీ ఆరోప‌ణ‌లు..!

పుష్ప‌పై కాపీ ఆరోప‌ణ‌లు..!

లెక్క‌ల మాస్టారు సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో అల్లు అర్జున్, ర‌ష్మిక మంధాన ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందుతున్న చిత్రం పుష్ప‌. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 13న విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఇటీవ‌ల బ‌న్నీ బ‌ర్త్‌డేను పుర‌స్క‌రించుకొని మూవీ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌కు భారీ రెస్పాన్స్ రాగా, 400మిలియ‌న్స్ వ్యూస్ సాధించింది.

టీజ‌ర్‌లో పుష్ప లుక్స్‌తో పాటు దేవి శ్రీ ప్ర‌సాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందరికి చాలా న‌చ్చింది. అయితే టీజ‌ర్ బీజీఎంను హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్ నుంచి దేవీ శ్రీ కాపీ కొట్టాడని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అవెంజ‌ర్స్ బీజీఎం, పుష్ప బీజీఎం రెండు ఒకేలా ఉన్నాయంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్ ర‌చ్చ చేస్తున్నారు. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు మూవీ టీం కాని,దేవి శ్రీ ప్రసాద్ కాని స్పందించ‌లేదు. కాగా, థ‌మ‌న్ ఎక్కువ‌గా ఈ కాపీ ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. పుష్ప చిత్రం శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపొందుతుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement