చెన్నై: ఇండియన్ టీమ్ మిస్టర్ డిపెండబుల్‌గా పేరుగాంచిన రాహుల్ ద్రవిడ్ ఎంత ప్రశాంతంగా కనిపిస్తాడో తెలుసు కదా. ఎప్పుడూ కామ్‌గా ఉంటూ వికెట్లకు అడ్డుగోడలా నిలిచి టీమ్‌ను ఎన్నోసార్లు గట్టెక్కించిన చరిత్ర ద్రవిడ్ సొంతం. అలాంటి రాహుల్ అందరిపైకి గట్టిగా అరుస్తూ, ఆగ్రహం వ్యక్తం చేయడం ఎప్పుడైనా చూశారా? మీరే కాదు ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా తానెప్పుడూ ఇలాంటి రాహుల్ భాయ్‌ను చూడలేదంటున్నాడు.
అతడు షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందిరానగర్ కా గూండా హు మై అంటూ ఓ యాడ్ కోసం ద్రవిడ్ చేసిన ఈ వీడియోను విరాట్ ట్విటర్లో షేర్ చేస్తూ.. రాహుల్ భాయ్‌ను ఇంతకు ముందెప్పుడూ ఇలా చూడలేదని కామెంట్ చేశాడు. ఈ వీడియో చూస్తే మీకూ అలాగే అనిపించడం ఖాయం.