ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Dec 08, 2020 , 04:40:57

ఆలయంలో ప్రత్యేక పూజలు

ఆలయంలో ప్రత్యేక పూజలు

నారాయణపేట రూర ల్‌ : మండలంలోని ఎక్లాస్‌పూర్‌ ఔదుంబర్‌ శివాలయంలో కార్తీక మాసా న్ని పురస్కరించుకొని సో మవారం శ్రీగిరి పీఠం శివ స్వామి ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామికి ప్ర త్యేక పూజలు, మహా మంగళహారతి నిర్వహించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. అలాగే ఔదుంబర్‌ శివాలయంలో బైరంకొండ కాల భైరవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గ్గొన్నారు.

కార్తీక దీపోత్సవం

మక్తల్‌ టౌన్‌ : వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా సాయంత్రం దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి ప్రతి కుటుంబం నుంచి ఒక్క రూపాయి తీసుకొని 100 కుటుంబాలతో కనకాభిషేకం, అనంతరం దీ పాలు వెలిగించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసారు. కార్యక్రమం లో ఆలయ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌గుప్తా, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


VIDEOS

logo