Primary Agricultural Cooperative Credit Society | యాదగిరిగుట్ట, మార్చి1 : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ల పదవికాలం మరో 6 నెలలు పొడిగిస్తూ జిల్లా సహకార అధికారి ఎన్. శ్రీధర్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన పదవీకాలం పూర్తి కావడంతో మరో 8 నెలలు వారి పదవుల్లో కొనసాగనున్నారు. దీంతో వీరి పదవికాలం ఆగస్టు 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఈలోగా ప్రభుత్వం ఏ సమయంలోనైనా ఎన్నికలకు వెళ్తే ప్రస్తుత చైర్మన్ల పదవిని రద్దు చేసే ఆవకాశం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పీఏసీఎస్ ప్రస్తుత మేనేజింగ్ కమిటీల్లో ఎన్నికైన సభ్యులను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించిన వ్యవహారాలను నిర్వహించేందుకు పర్సన్- ఇన్చార్జీ కమిటీలుగా వ్యవహరించనున్నారు. కాగా వీరిలో ప్రస్తుతం పర్సన్ ఇన్చార్డీ కమిటి చైర్మన్‌తోపాటు మరో 12 మంది సభ్యులు ఉంటారు. వీరిలో వైస్ చైర్మన్ పదవిని తొలగించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 21 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లుగా ప్రస్తుత ఉన్న చైర్మన్లు పర్సన్-ఇన్ చార్జీ(పీఐసీ) చైర్మన్లుగా మరో ఆరు నెలలపాటు ఉంటారు.
వంగపల్లి పీఏసీఎస్ పీఐసీ చైర్మన్ గా గొంగిడి మహేందర్ రెడ్డి..
వంగపల్లి పీఏసీఎస్ పర్సన్- ఇన్చార్జీ(పీఐసీ) చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి మరో 8నెలల పాటు వ్యవహరించనున్నారు. ఆయనతోపాటు పీఐసీ సభ్యులుగా ఎగ్గిడి బాలయ్య, బి.గౌరమ్మ, డి. కృష్ణ, ఎస్. వీరస్వామి, ఎస్. సత్తిరెడ్డి, పి.ఆనిత, బి. యాదిరెడ్డి, ఏ. రమేశ్, జీ. శ్రీనివాస్, ఎం. రామచందర్, కే. ఉపేందర్నాయక్గా కొనసాగనున్నారు. యాదగిరిగుట్ట పీఏసీఎస్ పీఐసీ చైర్మన్‌గా.. ఇమ్మడి రామిరెడ్డితోపాటు మిగతా 12 మంది సభ్యులుగా వ్యవహరించనున్నారు.
Nidamanur | కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. పదిమంది మహిళలకు గాయాలు
Jawahar Nagar | 15 కోట్ల విలువైన సర్కారు భూమి కబ్జాకు యత్నం.. కంచెను ఖతం చేసిన కబ్జాదారుడు ఎవరు..?