Jagadish Reddy | మోత్కూరు, సెప్టెంబర్ 14 : మా నాయకుడు జగదీశ్ రెడ్డిని విమర్శలు చేసే ముందు మీ నాయకుడు సామెల్కు ఏ స్థాయి ఉందో.. మాకు అదే స్థాయి ఉందని మీ నాయకున్ని అంటే మీకు మండినట్టే మా నాయకుడిని అంటే మాకు మండుతుంది అని.. మా నాయకులపై అనుచిత వాఖ్యలు చేస్తే సహించేదిలేదని మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్, బీఆర్ఎస్ మోత్కూర్ మండల పార్టీ అధ్యక్షుడు పొన్నబోయిన రమేష్ అన్నారు.
మీకు రాజకీయ భిక్ష పెట్టిన జగదీశ్ రెడ్డి అండ దండా లేనిది మీకు రెండు సార్లు గిడ్డంగుల చైర్మన్ పదవి వచ్చేదేనా..? అని ప్రశ్నించారు. నువ్వు పార్టీ మారి MLA అవ్వు.. మంత్రి అవ్వు కానీ.. నిబద్దత కలిగిన తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమ నాయకుడు జగదీశ్వర్ రెడ్డిపై అవాకులు చెవాకులు మాట్లాడితే ఊరుకోము అన్నారు.
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొణతం యాకుబ్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరమ్ మాజీ అధ్యక్షుడు రాంపాక నాగయ్య, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పైళ్ల దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సోమిరెడ్డి రాజకీయ విమర్శలే మాట్లాడు.. మీ బట్టలు మీరే విప్పుకొని L.N గార్డెన్ సాక్షిగా తిరిగింది నిజమే కాదా..? బట్టలిప్పుకొని తిరిగిన తరువాత మీకుందే మాకుంది అనుకోని కలిసిపోయిన మీరు ఎవరి బట్టలు విప్పుతారు. పార్టీ పరంగా అయిన వ్యక్తిగతంగా అయినా ఎవరి హయాంలో మోత్కూర్ మున్సిపాలిటీ అయింది. ఎవరు తెచ్చిన నిధులతో మీరు పోస్తున్న CC రోడ్లు. మెయిన్ రోడ్డు పోస్తున్నారో బహిరంగ చర్చకు సిద్దమేనా అన్నారు.
ముగ్గుల పోటీలు పెట్టిన డాక్టర్ మౌనంగా..
గాదరికిశోర్ కుమార్ తెచ్చిన నిధులే తప్పా కొత్తగా తెచ్చిందిలేదు.. చేసిందేమిలేదన్నారు. మోత్కూర్ మినీ స్టేడియాన్ని కొందరు ఆక్రమించుకున్నారని మున్సిపాలిటీ డబ్బులతో మీటింగ్ పెట్టి MLAను అఖిల పక్షనాయకులను పిలిచి హంగు ఆర్భాటంతో ముగ్గుల పోటీలు పెట్టిన డాక్టర్ మౌనంగా ఉండటం వెనుక మతలబు ఏమిటో మున్సిపాలిటీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
స్టేడియం భూమిని ఆక్రమించుకున్నారని ఎవరిమీద లక్ష్మినర్సింహా రెడ్డి ఆరోపణ చేసినాడో అయన ఈయన ఇద్దరు కలిసి మాపై ఆరోపణలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ముగ్గుల కాడ మొదలైన పంచాయితీపెగ్గుల కాడ రాజీకొచ్చింది నిజం కాదా..? అన్నారు. మీ రాజకీయ లబ్ధికోసం ప్రజలను పక్కతోవ పట్టించింది వాస్తవం కాదా అన్నారు?.
ఈ కార్యక్రమంలో నాయకులు బీఆర్ఎస్ నాయకుడు గజ్జి మల్లేష్, మర్రి అనిల్, సామ పద్మారెడ్డి, కొణతం మహేందర్ రెడ్డి, విద్యాసాగర్, గుంటి దేవా, జిట్ట సాయి, కూరెళ్ల రమేష్, దాసరి నవీన్, కన్నీబోయిన గిరియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Koppula Eshwar | కర్ర శ్రీహరికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
Rayapole | ‘తాపీ కార్మిక సంఘం లేకపోవడంతో కార్మికులకు అనేక ఇబ్బందులు’
Nizampet | యూరియా కోసం బారులు తీరిన రైతులు