Rayapole | రాయపోల్, సెప్టెంబర్ 14 : రాయపోల్ మండల తాపీ కార్మిక సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు మండల తాపీ కార్మిక సంఘం సీనియర్ నాయకుడు పెద్దోళ్ళు ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. మండలంలోని ప్రతీ గ్రామంలోని తాపీ కార్మికులు, సెంట్రింగ్ కార్మికులు, పెయింటింగ్ కార్మికులు, ఎలక్ట్రిషన్, ప్లంబర్, కార్పెంటర్ తదితర రంగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నూతన కార్యవర్గంలో పాలుపంచుకోవాలని ఆయన సూచించారు.
తాపీ కార్మిక సంఘం లేకపోవడం వలన కార్మికులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. ఈ నేపథ్యంలో మండల కమిటీ వేసుకుంటే అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన గుర్తు చేశారు. తాపీ కార్మిక సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వం కార్మికులకు అమలు చేస్తున్న హక్కులను సాధించుకోవాలని ఆయన పేర్కొన్నారు.
కార్మికులకు చెందాల్సిన న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. కావున ఈ నెల 17న రాయపోల్‌లో జరిగే తాపీ కార్మిక సంఘం నూతన కార్యవర్గానికి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన కార్మికులు తరలిరావాలని ఆంజనేయులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Edupayala Temple | పెరిగిన వరద.. వనదుర్గ ఆలయం మరోసారి మూసివేత
Rayapole | కొత్తపల్లిలో పడకేసిన పారిశుధ్యం.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
Tragedy | రెండేళ్ల కూతుర్ని పాతిపెట్టి.. ప్రియుడితో పరారైన మహిళ.. మూడు నెలల తర్వాత బయటపడ్డ నిజం!