నిజాంపేట, సెప్టెంబర్ 14 : రాష్ట్రంలో యూరియా కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. బస్తా యూరియా కోసం రాత్రన, పగలనక క్యూలైన్లో ఉంటే దొరకని పరిస్థితి నెలకొంది. తాజాగా మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట పిఎసిఎస్ సొసైటీ వద్ద ఆదివారం యూరియా కోసం రైతులు బారులు తీరారు.
ఉదయం నాలుగు గంటలకే సొసైటీ వద్దకు చేరుకొని యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. రోజురోజుకు యూరియా సమస్య ఎక్కువనే అవుతున్నది. ప్రజలకు సరిపడా యూరియాను సరఫరా చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని రైతులు మండిపడుతున్నారు. వృద్ధ రైతులు క్యూలైన్లో నిలబడి అసహనానికి గురవుతున్నారు.