Dairy Farmers | యాదగిరిగుట్ట, మార్చి 4 : పాడి రైతుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ యాదగిరిగుట్ట విజయ డైరీ వద్ద నిరసన చేపట్టిన రైతులతో కలిసి రైతు సంఘం నాయకులు విజయ డైరీ ఇన్ఛార్జ్ బాలరాజుకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట విజయ డైరీకి 35 గ్రామాల నుండి రోజుకు 6000 లీటర్లు రైతులు పాలు పోస్తున్నారన్నారు. ఒక బిల్లు సుమారు 40 లక్షల రూపాయలు రైతులకు రావాల్సి ఉంది. ఇప్పటికీ నాలుగు బిల్లులు పెండింగ్‌లో ఉండడం వల్ల సుమారు కోటి 60 లక్షల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ పరిస్థితి రైతులకు ఇబ్బందిగా మారి అప్పులు చేసి పశువులకు దాణా కొనుగోలు చేస్తున్నారన్నారు.
కుటుంబాల పోషణ కోసం పాలనే నమ్ముకున్న రైతులను ఇబ్బందులు పెట్టడం సరైనది కాదనన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రవ్యాప్తంగా కూడా విజయ డైరీలో పాలు పోస్తున్న రైతులందరికీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పాల ఉత్పత్తిదారులకు వడ్డీ లేకుండా గేదెలను కొనుగోలు చేయడానికి రుణాలు ఇవ్వాలని, సబ్సిడీపై పశువులకు దాణా సప్లయ్ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి బండి జంగమ్మ, సీపీఐ మండల సహాయ కార్యదర్శి పేరబోయిన మహేందర్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు బబ్బురి శ్రీధర్, మాజీకో ఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య, రైతు సంఘం నాయకులు పేరబోయిన బంగారి, విజయ డైరీ గుండ్లపల్లి చైర్మన్ కంబాల మహేష్, సీపీఐ పట్టణ కార్యదర్శి గోపగాని రాజు, రైతులు కంబాల కృష్ణ, బొడ్డు యాదగిరి, పేరబోయిన సత్యం, కంబాల రాజు, బండ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
మీడియాకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం : హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు
Madhabi Puri Buch | సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
AC Bus Shelter | బోరబండలో ఏసీ బస్ షెల్టర్ కబ్జా.. కిరాయికి ఇవ్వటానికి రెడీస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు