హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో క్రీడా పాత్రికేయులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావును స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్‌జాట్) ప్రతినిధులు కోరారు. ఐపీఎల్ కవరేజీ కోసం స్టేడియానికి వచ్చే జర్నలిస్ట్‌లకు బీసీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఎస్‌జాట్ 2025 వార్షిక డైరీని సంఘం ప్రతినిధులు జగన్ మోహన్ రావుతో పాటు ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, సంయుక్త కార్యదర్శి బసవరాజు, కోశాధికారి సీజే శ్రీనివాసరావుకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జాట్ అధ్యక్షడు ఆర్.కృష్ణా రెడ్డి, ఎం.శ్రీనివాస్ దాస్, ఉపాధ్యక్షుడు ఎస్.ఎస్బి సంజయ్, సంయుక్త కార్యదర్శి సిహెచ్ రాజశేఖర్, ఈసీ సభ్యులు జి.సునీల్ గౌడ్, అనిల్ యాదవ్, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.