RTC Buses | చండూరు మార్చ్ 03 : నల్లగొండ నుంచి సాయంత్రం 5 గంటల తర్వాత చండూరు, హైదరాబాద్ రూట్లో బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి అన్నారు. ఇవాళ చండూరులో ఆయన మాట్లాడుతూ.. సాయంత్రం 5 గంటల తర్వాత నల్లగొండ నుంచి చండూరు మీదుగా మాల్, చౌటుప్పల్ రూట్లలో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
బస్సుల కుదింపు వల్ల ఎండాకాలం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారని అన్నారు. నల్లగొండ నుంచి చండూరు మీదుగా మాల్ రూట్లో, చౌటుప్పల్ రోడ్లలో బస్సులను పెంచాలని కోరారు. ఎండాకాలం, విద్యార్థులకు పరీక్షల సందర్భం, జాతర సీజన్లను దృష్టిలో పెట్టుకొని అధికారులు బస్సులను పెంచాలని విజ్ఞప్తి చేశారు.
Kerala Man Shot Dead | ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నం.. కాల్పుల్లో కేరళ వ్యక్తి మృతి
KTR | కేటీఆర్ సూచనతో కదిలిన అధికారులు.. రంగనాయక సాగర్ కాలువను సందర్శించిన అధికార యంత్రాంగం
Maoists | మనుగడ ఉండదని.. లొంగిపోయిన 14 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు