(MLA Lingaiah) నకరేకల్: రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని ఓగోడు గ్రామంలో నిర్వహించిన సంబురాల్లో స్థానిక శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఓగోడు గ్రామ రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించి సీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో 8 విడతల్లో నేరుగా బదిలీ చేసిన మొత్తం ఈ నెల 10 కల్లా రూ.50,682.30 కోట్లకు చేరనున్నదన్నారు. రైతు బీమా, రైతు బంధు దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియడారు. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ఘనత కేవలం సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు పంటలు పండించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందిస్తున్నదని చిరుమర్తి లింగయ్య తెలిపారు. ఈ మహత్తర పథకం ద్వారా రైతులు అప్పుల కోసం బ్యాంకర్లను, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్రంలో అప్పుల బాధతో రైతుల బలవన్మరణాల దాఖలా లేకుండా పోయిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు యావత్ దేశానికే దిక్సూచిగా మారాయని, నకిరేకల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో చిలుమర్తి నాగరాజు సాగు చేస్తున్న బొప్పాయి పంటను పరిశీలించి అభింనందించారు. నాగరాజును ఆదర్శంగా తీసుకుని రైతులు అధిక లాభాలనిచ్చే పంటలు వేయాలని సూచించారు.
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్‌క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని కచ్చితంగా తినాల్సిందే!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..