Omicron Symptoms: గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
Omicron Symptoms: ఈ వైరస్‌తో బాధపడుతున్న రోగులు అనేక రకాల లక్షణాలను బయటపెడుతున్నారు. కరోనా ప్రధాన లక్షణాలతోపాటు కొన్ని ఇతర లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి...

(Omicron Symptoms) వాషింగ్టన్ : ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. ఈ వైరస్‌తో బాధపడుతున్న రోగులు అనేక రకాల లక్షణాలను బయటపెడుతున్నారు. కరోనా ప్రధాన లక్షణాలతోపాటు కొన్ని ఇతర లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం, ఒమిక్రాన్‌తో బాధపడుతున్న వ్యక్తులు.. ప్రధానంగా అధిక శరీర ఉష్ణోగ్రతలు, కొత్తగా దగ్గు రావడం లేదా నిరంతరంగా దగ్గడం, రుచి లేదా వాసనలో మార్పు ఉంటుంది. ఒమిక్రాన్ సోకిన వారిలో చర్మం, గోర్లు, పెదవుల రంగులో మార్పులు వంటి లక్షణాలను కూడా గుర్తించారు. నవంబర్‌లో ఈ వేరియంట్ గుర్తించినప్పటి నుంచి దీని లక్షణాలకు కనిపెట్టే పనిలో పలు దేశాల శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు.
సీడీసీ తెలిపిన వివరాల ప్రకారం.. ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్లో చర్మం, గోర్లు లేదా పెదవుల రంగులో మార్పు ఉంటుంది. పసుపు, బూడిద లేదా నీలం చర్మం, వేలి గోర్లు, పెదవులు రక్తంలో ఆక్సిజన్ కొరతను సూచిస్తాయి. వీటితోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దడ, తలనొప్పి, శరీరం నొప్పులు, ఛాతీపై ఒత్తిడి, గందరగోళంగా ఉండటం, స్థిరంగా నిద్ర రాకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. మన శరీరంలోకి వైరస్ ప్రవేశించిన 2 నుంచి 14 రోజుల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తేలికపాటి నుంచి తీవ్రమైనవిగా ఉంటాయి. బ్రిటన్‌కు చెందిన కొవిడ్ స్టడీ యాప్ జెడ్ఓఈ ప్రకారం, ఒమిక్రాన్ లక్షణాల్లో మలబద్ధకం, అతిసారం, నిద్రిస్తున్నప్పుడు చెమటలు పట్టడం, కళ్ళ వాపు, చర్మంలోని ఏదైనా భాగంలో వాపు రావడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపించగానే వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకుని వైద్యం తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
చాతిలో నొప్పి వస్తే అది గ్యాస్ట్రిక్ సమస్యా? గుండెనొప్పా?
కళ్లు పొడిబారుతున్నాయా..? తస్మాత్ జాగ్రత్త!
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

