(Florona) కరోనా వైరస్ వ్యాప్తితో ఒకవైపు ప్రపంచ దేశాలు ఇబ్బందిపడుతుండగా.. కొత్త కొత్త వేరియంట్లు వస్తూ మరింత భయపెడుతున్నాయి. నిన్నటికి మొన్న ఒమిక్రాన్ బయటపడగా.. ఇప్పుడు మరో వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ గర్భిణిలో కొవిడ్-19, ఇన్‌ఫ్లూయెంజా డబుల్ ఇన్ఫెక్షన్ను వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధికి ‘ఫ్లొరోనా’ అని పేరు పెట్టారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న సమయంలో ఈ కొత్త రకం వైరస్ బయటపడి శాస్త్రవేత్తల ఆందోళనను మరింత పెంచింది.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఫ్లోరా డెల్టా లేదా ఒమిక్రాన్ వంటి కొత్త కరోనా జాతి లేదు. ఫ్లొరోనాతో బాధపడుతున్న రోగిపై కరోనా వైరస్, ఇన్‌ఫ్లూయెంజా వైరస్ రెండూ ఏకకాలంలో దాడి చేస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ మరింత ప్రమాదకరంగా మారుతుంది. కరోనా ప్రారంభమైన తర్వాత ఫ్లొరోనా కేసు నమోదవడం ఇదే మొదటిసారి.
కరోనా వైరస్ మన శ్వాసకోశ వ్యవస్థకు సోకుతుండగా.. ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ఇన్ఫెక్షన్ న్యుమోనియా, మయోకార్డిటిస్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. భవిష్యత్‌లో రోగుల మరణానికి కూడా దారితీసే అవకాశాలున్నాయి.
ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) ప్రకారం, ఫ్లొరోనా ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. గత వారంలో ఇజ్రాయెల్ దవాఖానలు దాదాపు 1,849 మంది ఇన్‌ఫ్లూయెంజా రోగులకు చికిత్స అందించాయి. ఒమిక్రాన్ వేవ్ కారణంగా దేశంలో కరోనా కేసులు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇజ్రాయెల్‌లో ఒమిక్రాన్ వేవ్ వచ్చే మూడు వారాల్లో గరిష్ట స్థాయికి చేరుకోనున్నది.
ఇప్పటివరకు అందుబాటులో ఉన్న డాటా ప్రకారం, ఫ్లొరోనా వైరస్‌కు గురైన వ్యక్తిలో అనేక లక్షణాలను ఏకకాలంలో చూడొచ్చు. ఇందులో న్యుమోనియా, మయోకార్డిటిస్, ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి. సరైన సమయంలో చికిత్స చేయకపోతే ఈ సమస్యలు ప్రాణాంతకంగా మారతాయి. ఈ రకం వైరస్‌పై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నట్లు కైరో యూనివర్శిటీ దవాఖానకు చెందిన డాక్టర్ నహ్లా అబ్దెల్ వహాబీ చెప్పారు.
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..