శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
Best food for Shrungaram: శృంగారం అనేది ఆలుమగల మధ్య అయస్కాంత శక్తి లాంటిది. ఆలుమగలిద్దరూ శృంగారంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. అయితే, వయసు పెరిగినా కొద్ది శృంగార వాంఛ తగ్గిపోతుంది. అది అందరిలో ఉండే సాధారణ సమస్యే. దంపతులిద్దరూ వయసు మీరి ఉండటంవల్ల శృంగార కోరికలు కూడా ఇద్దరిలో తక్కువగానే ఉంటాయి. కానీ కొంతమందిలో

హైదరాబాద్: శృంగారం అనేది ఆలుమగల మధ్య అయస్కాంత శక్తి లాంటిది. ఆలుమగలిద్దరూ శృంగారంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. అయితే, వయసు పెరిగినా కొద్ది శృంగార వాంఛ తగ్గిపోతుంది. అది అందరిలో ఉండే సాధారణ సమస్యే. దంపతులిద్దరూ వయసు మీరి ఉండటంవల్ల శృంగార కోరికలు కూడా ఇద్దరిలో తక్కువగానే ఉంటాయి. కానీ కొంతమందిలో మాంచి వయసులో ఉండగానే శృంగారంపై ఆసక్తి సన్నగిల్లుతుంది. అంటే ఆయస్కాంత శక్తి నశించిపోతుంది. దీనివల్ల ఆలుమగల మధ్య సఖ్యత దెబ్బతింటుంది. దాంతో బంధం బలహీనపడుతుంది.
వయసు మళ్లిన వారిలో శృంగార కోరికలు తగ్గడానికి వయసే కారణమైతే, వయసులో ఉన్నవారిలో శృంగార కోరికలు తగ్గడానికి జీవనవిధానంలో మార్పులు, మితిమీరిన శారీరక శ్రమ, అలసట, మానసిక ఒత్తిడి లాంటివి కారణాలుగా చెప్పవచ్చు. వృద్ధుల్లో శృంగార వాంఛ తగ్గడం సాధారణం కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, యుక్త వయస్కులు మాత్రం ఇలాంటి సమస్య నుంచి బయటపడాల్సిందే. కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు. సన్నగిల్లిన కోరికలను గుర్రాల్లా పరుగెత్తించవచ్చు. మరి ఆ పదార్థాలేవో తెలుసుకుందామా..?
నత్తలు: అణిగిపోయిన శృంగార కోరికలను తట్టిలేపడంలో నత్తగుల్లలు బాగా పనిచేస్తాయి. నత్తల్లో జింక్ సమృద్ధిగా ఉంటుంది. ఈ జింక్.. టెస్టోస్టిరాన్ అనే లైంగిక హార్మోన్ స్థాయిలను నియంత్రించడంలో, నరాల్లో రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చడంలో తోడ్పడుతుంది. కాబట్టి నత్తలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి.
సాల్మన్ చేప: సాల్మన్ చేపలు కూడా శృంగార వాంఛలు పెరుగడానికి తోడ్పడుతాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలతోపాటు, ఇతర విటమిన్లు ఉంటాయి. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చి శృంగార కోరికలను పెంచుతాయి.
అవకాడోలు: శృంగార కోరికలను పెంచడమేగాకుండా, అంగస్తంభన లోపాలను సరిచేయడంలో అవకాడోలు బాగా పనిచేస్తాయి. రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించి రక్త ప్రవాహం మెరుగుపడేలా చేయడంలో కూడా ఇవి తోడ్పడుతాయి.
ఇతర పదార్థాలు: పైన పేర్కొన్నవేగాక జింక్ ఎక్కువగా ఉండే రెడ్‌మీట్, ఉడికించిన బీన్స్, పాలు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, బాదం గింజలు, చిరు ధాన్యాలను తరచూ తీసుకోవడంవల్ల రక్త ప్రసరణ బాగా జరిగి శృంగార కోరికలు పెరుగుతాయి. అదేవిధంగా సిట్రస్ జాతి పండ్లు, ఆపిల్స్, బెర్రీస్, గ్రేప్స్, రెడ్ వైన్, టీ, డార్క్ చాక్లెట్స్ కూడా నరాల్లో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. వీటితోపాటు నైట్రేట్స్ అధికంగా ఉండే పాలకూర, తోటకూర తదితర ఆకు కూరలు, ముల్లంగి లాంటివి కూడా శృంగార వాంఛలను రేకెత్తిస్తాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

