Omicron symptoms: చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
Omicron symptoms : లండన్ కింగ్స్ కాలేజీ, హెల్త్ సైన్స్ కంపెనీ జెడ్ఓఈ సంయుక్తంగా పరిశోధన జరిగి ఒమిక్రాన్ లక్షణాలపై అధ్యయనం చేసి కొన్ని లక్షణాలను వెల్లడించారు. చర్మంపై అసాధారణ దద్దుర్లు, దురదలను...

(Omicron symptoms) గత కొన్ని రోజులుగా కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తూ ప్రపంచదేశాలను భయపెడుతున్నది. అయితే, దీని లక్షణాలు ఎలా ఉంటోయో ఇంతవరకు తెరపైకి రాలేదు. లండన్ కింగ్స్ కాలేజీ, హెల్త్ సైన్స్ కంపెనీ జెడ్ఓఈ సంయుక్తంగా పరిశోధన జరిగి ఒమిక్రాన్ లక్షణాలపై అధ్యయనం చేసి కొన్ని లక్షణాలను వెల్లడించారు. చర్మంపై అసాధారణ దద్దుర్లు, దురదలను ఎదుర్కొంటుంటే.. అది ఒమిక్రాన్ కావచ్చునని చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో చర్మానికి సంబంధించిన మార్పులను గమనించడం చాలా ముఖ్యమని సెలవిస్తున్నారు.
లండన్ కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు జెడ్ఓఈ కొవిడ్ స్టడీ యాప్‌తో 3.36 లక్షల మంది డాటాపై అధ్యయనం జరిపారు. కరోనా పాజిటివ్ రోగుల్లో 8.8 శాతం మందిలో చర్మంపై దద్దుర్లు ఉన్నట్లు కనుగొన్నారు. అలాగే, 8.2 శాతం మంది వ్యక్తులు కొవిడ్ పరీక్ష చేయించుకోనప్పటికీ.. వారిలో కరోనా సాధారణ లక్షణాలతో పాటు చర్మంపై దద్దుర్లు కూడా కనిపించాయి. దద్దుర్లను తనిఖీ చేసేందుకు శాస్త్రవేత్తలు ఆన్లైన్ సర్వే కూడా చేపట్టారు. ఈ సర్వేలో, కరోనాతో బాధపడుతున్న 12 వేల మంది చర్మంపై దద్దుర్లు బయటపడ్డాయి. 17 శాతం కరోనా పాజిటివ్ వ్యక్తులు చర్మంపై దద్దుర్లు తమ మొదటగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో, ప్రతి ఐదుగురిలో ఒకరు చర్మం దద్దుర్లు మాత్రమే కరోనా ఇన్ఫెక్షన్ ఏకైక లక్షణంగా భావించారు.
ఈ నేపథ్యంలో 3 రకాల దద్దుర్ల గురించి తెలుసుకుందాం..

రీచ్‌గా దద్దుర్లు : ఈ రకంలో హఠాత్తుగా దద్దుర్లు వస్తాయి. వాటంతట అవే మాయమవుతాయి. దద్దుర్లు శరీరంలోని ఏ భాగంలోనైనా రావచ్చు. ఈ సాధారణ అలెర్జీ లక్షణం కరోనా ఇన్ఫెక్షన్ ప్రారంభంలోనే కనిపిస్తాయి.
చికెన్ పాక్స్ లాంటి దద్దుర్లు : ఇవి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, చేతులు, కాళ్ల వెనుక భాగంలో వస్తాయి. ఎరుపు, దురద దద్దుర్లుగా ఉంటాయి. కొన్ని వారాలపాటు ఇబ్బంది పెడతాయి.
చిల్‌బ్లెయిన్ : ఈ రకం దద్దుర్లు సాధారణంగా శీతాకాలంలో కనిపిస్తుంటాయి. ప్రస్తుతం కరోనా ఇన్ఫెక్షన్ సమయంలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రకంలో వ్యక్తి పాదాలు, చేతుల వేళ్లలో ఎరుపు, ఊదా రంగులో దద్దుర్లు ఏర్పడతాయి. దురదకు బదులుగా కొన్నిసార్లు వాపు కూడా వస్తుంది. యువతలో వ్యాధి సోకిన కొద్ది రోజుల తర్వాత ఈ లక్షణాలు బయటపడతాయి.
ఇవి కూడా చదవండి..
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

