రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు అక్షర సత్యం
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఏఐసీసీ పెద్దలపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
- రేవంత్ పాలనంతా అవినీతి, అక్రమాలే
- కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ మండిపాటు
- నల్సార్ విద్యార్థుల పోరాటానికి సెల్యూట్
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఏఐసీసీ పెద్దలపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఎక్స్‌వేదికగా ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై సొంత పార్టీ నేతలే గళం విప్పుతున్నారని ఎద్దేవాచేశారు. దీనికి తోడు నల్సార్ విశ్వవిద్యాలయ విద్యార్థులపై జరిగిన పరిణామాలపై స్పందిస్తూ యువత తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు పోరాడటాన్ని అభినందించారు.
రాజగోపాల్‌రెడ్డి ఆరోపణలతో ఏకీభవిస్తున్నా
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ ఆయన మాటలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని తెలిపారు. పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి 6 లక్షలు ఇచ్చేందుకు దాదాపు 500 రకాల నిబంధనలు, షరతులు పెడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర అగ్ర నేతలు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ ప్రజాధనాన్ని పకదారి పట్టిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. సొంత పార్టీ శాసనసభ్యులే బహిరంగంగా బయటపెడుతున్నందున ఈ ప్రభుత్వం సమాధా నం చెప్పాల్సిన అవసరం ఉన్నదని డిమాండ్ చేశారు. ఏఐసీసీ ఖజానాకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఏటీఎమ్‌గా మార్చుకున్నారని కేటీఆర్ విమర్శించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా తెలంగాణ ఏఐసీసీకి ఏటీఎమ్‌లా మారిందని పదేపదే చెప్తుంటారని, కానీ క్షేత్రస్థాయిలో ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోకపోవడం అనుమానాస్పదంగా ఉన్నదని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు సీజేఐకి ధన్యవాదాలు
న్యాయ విద్యా సంస్థ నల్సార్ ఘటనపై మాట్లాడిన కేటీఆర్, తమ ఆత్మగౌరవం, ప్రతిష్టపై దాడి జరిగినప్పుడు భారతీయ యువత స్పందించే తీరుకు నల్సార్ విద్యార్థుల పోరాటమే నిదర్శనమని తెలిపారు. హకుల కోసం ధైర్యంగా నిలబడిన నల్సార్ విద్యార్థులకు విప్లవాత్మక సె ల్యూట్ తెలియజేశారు. విద్యార్థులు, న్యాయవ్యవస్థ మధ్య సంబంధాన్ని గుర్తించి, ఈ అంశంపై ముందుకు వచ్చి స్పం దించిన భారత ప్రధాన న్యాయమూర్తి కి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పీడితుల, సాధారణ ప్రజల గళం మరింత బలంగా వినబడుతుందని ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

