నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగ స్టు 15 : ఉమ్మడి వరంగల్ జిలా ్లవ్యాప్తంగా శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఊరూరా, వాడవాడలా జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ఈ సందర్భంగా విదేశీ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు మహనీయులు చేసిన పోరాటా లు, త్యాగాలను స్మరించుకున్నారు. స్వాతం త్య్ర సమర యోధులను సన్మానించారు. ఉత్తమ ఉ ద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పలుచోట్ల స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.

హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖల మం త్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వరంగల్‌లోని ఖుష్‌మహల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖల మంత్రి మంత్రి కొండా సురేఖ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జనగామ కలెక్టరేట్, మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం, భూపాలపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్‌లు బీర్ల అయిలయ్య, జాటోత్ రామచంద్రూనాయక్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు.
ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో జరిగిన వేడుకల్లో మంత్రి సీతక్క జాతీయ జెండా ఎగురవేసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో ముఖ్య అతిథులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నివేదికను చదివి వినిపించారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ ప్రాంతం అనేక మంది అమరులు, ఉద్యమకారులు, త్యాగధనులకు జన్మనివ్వడమే కాకుండా తెలంగాణ సాయుధ పోరాటానికి కీలక కేంద్రంగా నిలిచిందన్నారు. హనుమకొండ పార్టీ కార్యాలయంలో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. భూపాలపల్లిలో జరిగిన వేడుకల్లో పార్టీ మాజీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతితో కలిసి పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన రాజ్యమేలుతున్నదని, కాంగ్రెస్ నాయకుల అసమర్ధతతో కరువు తరుముకొస్తున్న దుస్థితి దాపురించిందన్నారు. వరంగల్ రంగశాయిపేటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, స్టేషన్‌ఘన్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వర్ధన్నపేటలోని అంబేద్కర్ సెంటర్, ఐనవోలులోని పార్టీ కార్యాలయం, గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్లో జరిగిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాల్గొని జాతీయ జెండాలు ఎగురవేశారు.

ములుగులో జాతీయ జెండా ఎగురవేస్తున్న మంత్రి సీతక్క, పక్కన కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు

మహబూబాబాద్‌లో జెండాకు వందనం చేస్తున్న విప్ రాంచంద్రునాయక్, చిత్రంలో కలెక్టర్ స్నేహా శబరీష్, ఎస్పీ శబరీష్

భూపాలపల్లిలోని పార్టీ కార్యాలయంలో జెండాకు వందనం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ నేతలు

భూపాలపల్లిలో గౌరవ వందనం స్వీకరిస్తున్న విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

స్టేషన్‌ఘన్‌పూర్‌లోని పార్టీ కార్యాయంలో జెండా ఎగురవేస్తున్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

వర్ధన్నపేట : అంబేద్కర్ సెంటర్లో జెండా ఆవిష్కరించి వందనం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్

వరంగల్‌లోని పార్టీ కార్యాలయ స్థలంలో జరిగిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని, నేతలు