జనగామ టౌన్, సెప్టెంబర్ 28 : జనగామ కలెక్టరేట్ ఎదుట ఓ రైతు సోమవారం ఆత్మహత్యకు యత్నించాడు. బచ్చన్నపేట మండలం చిన్నరాంచర్లకు చెందిన రైతు గుడికందుల కనకయ్యకు తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. దాన్ని కొలతలు వేస్తే 8 ఎకరాలు మాత్రమే చూపిస్తున్నది.
పక్కనే ఉన్న మరో వ్యక్తికి రికార్డుపరంగా 10 ఎకరాలు ఉంటే అతడు 11 ఎకరాల భూమిని దున్నుకుంటున్నాడు. ఈ విషయంలో అధికారులు పట్టించు కోకపోవడంతో సోమవారం కలెక్టరేట్ ఎదుట డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానిక పోలీసులు వెంటనే స్పందించి బాటిల్ గుంజుకోవడంతో ప్రమాదం తప్పింది.