Jagadish Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ మీద విచారణ చేయమని అడిగితే రేవంత్ రెడ్డి అందరి మీద చేయిస్తాడంట. దొంగతనం చేసిన దొంగ మీద విచారణ చేయకుండా, పట్టుకున్న పోలీసు మీద విచారణ చేసినట్లుంది కథ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు.
అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రస్తావించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై మీడియా సమావేశంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడు దొంగతనం చేసిన దొంగమీద లేదు విచారణ.. ఇది పట్టుకున్న పోలీసుల మీద విచారణ.. రాష్ట్ర ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాలన్నారు.
దొంగతనం చేసిన ఆయన మీద చర్యలు కాదట.. పట్టుకున్నందుకు పట్టుకున్న ఆయన మీద విచారణ జరిపిస్తరట. డిఫెండ్ చేయలేక అందరు మంత్రులు అలిసిపోయిర్రు. ఆనాడు రేవంత్ రెడ్డి ఎట్లైతే రూ.50 లక్షలతో బహిరంగంగా దొరికిపోయిండో. ఇది అంతకంటే విష్పష్టంగా డాక్యుమెంట్లతో, ఆధారాలతో పొంగులేటి దొరికిపోయిండు. అతను చెప్పుకోవడానికి అవకాశముంది. నిరూపించుకోవడానికి అవకాశముందన్నారు.
రేవంత్ రెడ్డి పట్టపగలు రూ.50 లక్షల బ్యాగ్ తో దొరికినట్లు, పొంగులేటి ఆధారాలతో దొరికిపోయాడు
పొంగులేటికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ మీద విచారణ చేయమని అడిగితే రేవంత్ రెడ్డి అందరి మీద చేయిస్తాడంట
దొంగతనం చేసిన దొంగ మీద విచారణ చేయకుండా, పట్టుకున్న పోలీసు మీద విచారణ చేసినట్లుంది కథ… pic.twitter.com/3vv2lfPfLf
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2026
‘పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయించాలి’
Mamata Banerjee | బెంగాల్‌ను టార్గెట్ చేస్తే.. కేంద్రంలో బీజేపీని గద్దె దించుతా : మమతాబెనర్జీ
Suicide | వ్యవసాయ విశ్వవిద్యాలయం అటవి ప్రాంతంలో ఒకరు ఆత్మహత్య