కరోనా నియంత్రణకు కఠిన చర్యలు: రిజ్వి
కరోనా నియంత్రణ| కరోనా కేసులు తగ్గినప్పటికీ ఇంకా అక్కడక్కడ కొత్తగా నమోదవుతున్నాయని, వాటి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి అన్నారు. రిజ్వీ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ఆదివారం నల్లగొండ జిల్లా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించింది.

నల్లగొండ: కరోనా కేసులు తగ్గినప్పటికీ ఇంకా అక్కడక్కడ కొత్తగా నమోదవుతున్నాయని, వాటి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి అన్నారు. రిజ్వీ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ఆదివారం నల్లగొండ జిల్లా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించింది. హెలికాప్టర్లో పలు జిల్లాలకు బయలుదేరిన రిజ్వి బంధం ముందుగా నాగార్జునసాగర్ చేరుకున్నది. విజయవిహార్ అతిథిగృహంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులపై ప్రత్యేకంగా రివ్యూ జరిపారు. తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేసారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో క్షేత్ర స్థాయిలో పర్యటించి, కరోనా విస్తరణకు గల కారణాలను లోతుగా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. కరోనా నియంత్రణకు ముందస్తుగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రణాళికలు రచించినట్లు వెల్లడించారు. వైద్య అధికారులు, సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తూ కరోనా నియంత్రణకు మరింత కృషి చేయాలని సూచించారు. సరిహద్దు జిల్లాల్లోని కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అధికారుల బృందం సాగర్ నుంచి మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట నియోజకవర్గాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. రిజ్వి వెంట డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఎంహెచో కొండల్ రావు, ఇతర వైద్య అధికారులు, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
‘కోపా అమెరికా’ విజేత అర్జెంటీనా
దేశంలో కొత్తగా 41 వేల కరోనా కేసులు
‘వర్జిన్ గెలాక్టిక్’.. నేడు రోదసీలోకి తెలుగమ్మాయి
తాలిబన్ ఎఫెక్ట్.. ఆఫ్ఘనిస్థాన్ నుంచి 50 మంది భారత అధికారులు వెనక్కి
దిగివచ్చిన ట్విటర్.. ఫిర్యాదు అధికారిగా వినయ్ ప్రకాశ్ నియామకం
జమ్ములో ఎన్ఐఏ తనిఖీలు.. ఐదుగురు అరెస్టు
కేరళలో మరో జికా వైరస్ కేసు.. 15కు చేరిన బాధితులు
హమ్మయ్య.. మెస్సీ మొత్తానికి సాధించాడు
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

