హమ్మయ్య.. మెస్సీ మొత్తానికి సాధించాడు

రియో డిజనీరో: అతడు ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్స్‌లో ఒకడు. అయినా ఇన్నాళ్లూ కెరీర్లో ఒక్క మేజర్ టైటిల్ కూడా తన నేషనల్ టీమ్‌కు సాధించి పెట్టలేకపోయాడన్న అపవాదును మోశాడు. నాలుగు మేజర్ టోర్నీ ఫైనల్స్‌లో ఓడిపోయిన తర్వాత, ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ వచ్చిన ఇన్నాళ్లకు అతని కల నెరవేరింది. ఇన్నాళ్లూ ఓడిన ప్రతిసారీ ఆ బాధతో కంటతడి పెట్టిన అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ.. మొత్తానికి తొలిసారి ఆనందం పట్టలేక ఏడ్చేశాడు. తన టీమ్‌కు 28 ఏళ్ల తర్వాత కోపా అమెరికా ట్రోఫీ సాధించి పెట్టి సగర్వంగా కాలరెగరేశాడు. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో బ్రెజిల్‌పై 1-0తో గెలిచిన అర్జెంటీనా 28 ఏళ్ల కరువు తీర్చుకుంది. అంతేకాదు 2500 రోజుల తర్వాత సొంతగడ్డపై బ్రెజిల్‌కు ఓటమి రుచేంటో చూపించింది.
మెస్సీదే కీరోల్
ఫైనల్లో డీ మారియా చేసిన ఏకైక గోల్‌తో అర్జెంటీనా ట్రోఫీ గెలిచింది కానీ.. టోర్నీ మొత్తం ఆ టీమ్ తరఫున కెప్టెన్ మెస్సీయే అద్భుతంగా రాణించాడు. మొత్తం 4 గోల్స్ చేయడంతోపాటు 5 గోల్స్ కావడంలో సాయం చేసి టోర్నీ టాప్ స్కోరర్, బెస్ట్ ప్లేయర్ ట్రోఫీలు అందుకున్నాడు. మెస్సీకిది అర్జెంటీనా తరఫున 151వ మ్యాచ్. ఆ టీమ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు కూడా మెస్సీదే. ఇన్ని మ్యాచ్‌లు ఆడిన తర్వాత కోపా ఫైనల్లో రిఫరీ చివరి విజిల్ వేయగానే మెస్సీ గ్రౌండ్‌లోనే మోకాళ్లపై కూర్చొని కన్నీళ్లు పెట్టాడు. తన కెరీర్లో అర్జెంటీనా తరఫున గెలిచిన తొలి మేజర్ టోర్నీ ఇదే మరి.
వరల్డ్‌కప్పే లక్ష్యం
2014 వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరిన అర్జెంటీనా.. జర్మనీ చేతిలో 0-1తో ఓడింది. తన టీమ్‌ను విశ్వవిజేతగా నిలపడానికి మెస్సీ అతి దగ్గరగా వచ్చిన సందర్భమదే. ఇక ఇప్పుడు వచ్చే ఏడాది ఖతార్‌లో జరగబోయే వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాకు ట్రోఫీ సాధించి పెట్టడమే మెస్సీ లక్ష్యంగా పెట్టుకున్నాడు. కోపా అమెరికా ట్రోఫీ కంటే ముందు 2005లో అర్జెంటీనా తరఫున అండర్-20 వరల్డ్‌కప్ గెలవడం, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ గెలవడమే మెస్సీ సాధించిన అతిపెద్ద విజయాలు.
మేజర్ టోర్నీల్లో చేదు అనుభవాలు
2006 వరల్డ్‌కప్ క్వార్టర్ఫైనల్లో జర్మనీ చేతిలో ఓడటం మేజర్ టోర్నీల్లో మెస్సీకి ఎదురైన తొలి పరాభవం. ఆ తర్వాతి ఏడాదే కోపా అమెరికా ఫైనల్లో బ్రెజిల్ చేతిలో అర్జెంటీనా 0-3తో చిత్తుగా ఓడింది. 2014 వరల్డ్‌కప్‌లో తన టీమ్‌ను ఫైనల్ వరకూ తీసుకొచ్చినా.. జర్మనీ చేతుల్లో ఓటమి తప్పలేదు. ఇక 2015, 2016 కోపా అమెరికా ఫైనల్స్‌లో చిలీ చేతిలో అర్జెంటీనా ఓడింది. 2016లో కోపా ఫైనల్లో ఓడిన తర్వాతే మెస్సీ ఇక రిటైరవుతున్నట్లు ప్రకటించాడు.
అయితే 2018 వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ టైమ్‌లో రిటైర్మెంట్ను మళ్లీ బయటకు వచ్చి అర్జెంటీనా తరఫున ఆడాడు. కానీ ఆ వరల్డ్‌కప్ ప్రిక్వార్టర్స్‌లోనే అర్జెంటీనా ఓడింది. ఇప్పుడు నేషనల్ టీమ్‌లో అడుగుపెట్టిన 15 ఏళ్ల తర్వాత, 34 ఏళ్ల వయసులో తన ట్రోఫీల కరువు తీర్చుకుంటూ కోపా అమెరికా కప్పు సాధించిపెట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

