దేశంలో కొత్తగా 41 వేల కరోనా కేసులు
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 42,766 కేసులు నమోదవగా, తాజాగా 41 పైచిలుకు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 2 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 41,506 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 4,54,118 కేసులు యాక్టివ్గా ఉండగా, 2,99,75,064 మంది బాధితులు కోలుకున్నారు.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 42,766 కేసులు నమోదవగా, తాజాగా 41 పైచిలుకు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 2 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 41,506 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 4,54,118 కేసులు యాక్టివ్గా ఉండగా, 2,99,75,064 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,08,040 మంది మృతిచెందారు.
కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 41,526 మంది కొత్తగా కోలుకోగా, 895 మంది కరోనావల్ల మరణించారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.47 శాతమని, రికవరీ రేటు 97.20 శాతానికి పెరిగిందని, పాజిటివిటీ రేటు 2.25 శాతం ఉన్నదని తెలిపింది. ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 37,60,32,586 డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. గత 24 గంటల్లో 37,23,367 మందికి వ్యాక్సినేషన్ చేశామని పేర్కొన్నది.
ఇవి కూడా చదవండి..
కేరళలో మరో జికా వైరస్ కేసు.. 15కు చేరిన బాధితులు
‘కోపా అమెరికా’ విజేత అర్జెంటీనా
‘వర్జిన్ గెలాక్టిక్’.. నేడు రోదసీలోకి తెలుగమ్మాయి
ప్రకాశవంతమైన సూపర్నోవా
పాఠశాలల్లో ఫీజుల మోత
ఇద్దరంటే ఇద్దరే!
కరోనా నెమ్మదించలేదు
శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా.. ఎంతంటే?!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

