కేతేపల్లి: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం రామాపురం గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం కేక్ కోసి చర్చికి వచ్చిన క్రిస్టియన్లకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామాపురం చర్చికి పెద్ద సంఖ్యలో క్రిస్టియన్లు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
క్రిస్మస్ అంటే ఏసు ప్రభువును జ్ఞాపకం చేసుకునే సమయం అని, విశ్వవ్యాప్తంగా ప్రజలందరిలో ప్రేమ, సహనం, కరుణ పూర్వక అనుబంధాలను మేల్కొలుపుతూ ఏసు బోధనలను ఆదరించే సందర్భం అని చిరుమర్తి లింగయ్య అన్నారు. ధర్మం, విశ్వాసపూరితమైన గమనానికి ఏసుక్రీస్తు జీవనం మనందరికీ ప్రేరణనిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా క్రైస్తవుల్లో శాంతి, సామరస్యం మరింత విరాజిల్లాలని ప్రార్థిస్తున్నానన్నారు. భక్తి శ్రద్ధలతో సురక్షితంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..