ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Mulugu - Jan 25, 2021 , 01:10:46

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

మల్హర్‌/కాటారం, జనవరి2: మల్హర్‌ మండలంలో తాడిచర్ల గ్రామానికి చెందిన వెంకటమ్మకు రూ.17,500 విలువగల సీఎం ఆర్‌ఎఫ్‌ చెక్కు మంజూరు కాగా పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు మంథనిలో ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ మల్క ప్రకాశ్‌రావు, రత్నకర్‌, పులిగంటి రాములు పాల్గొన్నారు. కాటారం కాటారం మండలంలోని గంగారం గ్రామానికి చెందిన ఎం.లక్ష్మీబాయికి రూ.40వేలు, దామెరకుంటలో బీ.దివ్యకు రూ.17,500, బీ.సుమలతకు రూ.25,500, జాదురావుపేటలో దుర్గం రాజమ్మకు రూ.8500, అంకుసాపూర్‌లో లిక్కి శ్రీనివాస్‌కు రూ.15వేల విలువగల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు మంజూరుకాగా టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు డోలి అర్జయ్య  పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి అధ్యక్షుడు కుడుదుల రాజబాబు, మందల లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ రవి తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo