రాంచీ, ఏప్రిల్ 25: జార్ఖండ్లో జరిగే గాండే అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సతీమణి కల్పనా సొరేన్ పోటీ చేస్తారని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) గురువారం ప్రకటించింది.
జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి మే 20న ఉప ఎన్నిక జరుగనుంది. ప్రస్తుతం గృహిణిగా ఉన్న కల్పనా ఎంటెక్, ఎంబీఏ చదువుకున్నారు. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సొరేన్ అరెస్టయిన విషయం తెలిసిందే.